శక్తి చేత విమోచన William marrion Branham Telugu message books

william marrion branham telugu message

william marrion branham telugu message

శక్తి చేత విమోచన

లూయిస్ విల్, కెంటకి, యుఎస్ఏ

54-0329

1మీకు వందనములు. స్నేహితులారా, శుభసాయంకాలము. మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామములో, ఇక్కడ ఉండి మరల మీతో మాట్లడుట ఒక భాగ్యము. ఎక్కడైనా దేవుని ప్రజలను కలుసుకొనుట మరియు యేసు, అనే ఆ గొప్ప నామములో మాట్లాడుట అది ఎల్లప్పుడూ గొప్ప భాగ్యమైయున్నది.మన సహోదరుడు ఇప్పుడే పాడిన ఆ పాటను నేను నిశ్చయముగా ప్రశంసించుచున్నాను. అది నాకు చాలా ఇష్టమైనది. ఈ రోజు వారు యేసును కేవలము ఒక ప్రవక్తగానో, లేక ఒక మంచి వ్యక్తిగానో, లేక ఒక బోధకునిగానో చేయుటకు ప్రయత్నించుచుండగా, అది నిజముగా ఆయన దైవత్వమును, ఆయన ఏమైయుండెనో దానిని బయటకు తెచ్చునది మరియు ఆయన అలా ఉండెనని నేను నమ్ముచున్నాను…..2ఆయనవంటి వారు, భూమి మీద ఎవరూ లేరు, ఇక ఎన్నడూ ఉండబోరు. ఆయన ఇమ్మానుయేలు అయి ఉండెను. ఆయనే అల్పాయు, ఓమెగయు; ఆదియు మరియు అంతము; ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు; దావీదు యొక్క వేరు మరియు చిగురునై ఉన్నాడు; అరుణోదయ నక్షత్రము. ఆయనయందు దైవత్వము నివసించెను. ఆయనలో దేవుడు ఉండెను.“ఈ లోకమును తనతో సమాధాన పరుచుకొనునట్లు, దేవుడు తన కుమారుని యందు, క్రీస్తునందు ఉండెను.” “నేను చేయు క్రియలు నావి కావు, నాయందు నివసించు తండ్రివే. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము,” అని యేసు చెప్పెను. దేవుడు శరీరమందు ప్రత్యక్షమయ్యెను. మన యెడల దేవుని ప్రేమ యొక్క ప్రత్యక్షత ఎంత అద్భుతమైనదిగా ఉన్నది, మానవ జాతిలో నుండి పాపమును, రోగమును తీసివేసి మనలను విమోచించి తండ్రి యొద్దకు తిరిగి చేర్చుటకుగాను, ఆయన తననుతాను బయలుపర్చుకొని, మరియు క్రిందికి దిగివచ్చి, మానవ శరీరములో నివసించుట. అది అద్భుతము, అది కాదా? దానిని మనము నిశ్చయముగా ప్రశంసించుదుము.3ఇప్పుడు, గతరాత్రి, ఒక విధముగా నేను క్షమాపణ చెప్పవలసి ఉన్నదని నేను ఊహించుచున్నాను. గతరాత్రి, బీల్లీ నన్ను కొంచెము త్వరపెట్టెను, ఎందుకనగా అది ఒక విధముగా… నేను బలహీనుడయ్యాను. అయితే ఆ కూటములు, ఆ ఆత్మ వివేచన, మరియు ఏ ఒక్కరికిని అదేమైయుండునో ఎంత మాత్రము తెలియదు… ఒకవేళ నీవు దానిలోనికి వెళ్తే తప్ప, నీవు దానిని ఎరుగలేవు, చూడండి. దానిని వివరించుటకు అక్కడ ఏ అవకాశము లేదు. నీవు చేయగలిగిన ఒక్క అవకాశము లేదు. కేవలము అది ఒక అనుభవము అయి ఉన్నది. కేవలము దానిగుండా వెళ్ళిన వారికి తప్ప, అది ఒక మనిషికి ఏమి చేయును: అతనిలో నుండి అదే జీవమును తీసికొనివచ్చును!సరే, నీవు రెండు ప్రపంచములలో జీవించుచున్నావు; నీవు ఇక్కడ ఉన్న ప్రపంచములో ఉన్నావు మరియు నీవు అక్కడ ఉన్న ప్రపంచములో ఉన్నావు, నీవు బహుశా యాబై సంవత్సరముల క్రితం ఎవరో ఒక వ్యక్తితో ఉంటివి; మరియు ఈ రోజు నుండి రానున్న కొన్ని సంవత్సరముల తర్వాత ఎవరితోనో ఉంటావు; మరియు అనేక సంవత్సరముల క్రితం, వారముల క్రితం, నెలల క్రితం; మరొక దేశము, మరొక స్థలము, లేక ఏదో ఒక దానిగూర్చి అలా జరిగిన దానిగూర్చి నీవు ఇక్కడ ఈ వేదిక మీద నిలువబడి మాట్లాడుటను గ్రహించగలవు. అప్పుడు దానిలో, నీయంతట నీవే సరియైనవానిగా ఉండుటకు ప్రయత్నించి, మరియు ఆలోచించగా; అది ఒక సంపూర్తియైన సంగతి అని నీకు చెప్పును. అయితే, ప్రభువు దానిలోనే ఇంతవరకు మనలను ఎంతగానో ఆశీర్వదించెను. మరియు మేము ఎంతగానో ఆనందిస్తూ, మరియు కూటము ద్వారా దేవుడు మహిమను పొందుకోగలడని విశ్వసిస్తున్నాము.4ఇప్పుడు, ఈ రాత్రి ఆరాధనలలో, మనం కేవలం కొద్దిమంది ప్రజలుగా అంతా కలిసి; మన కూడికలు ఇక్కడ స్థానికముగా ఉన్న వారికే ప్రకటించబడినవి, మరియు కేవలం అది స్థానికముగా ఉన్న ప్రజల కొరకు అయి ఉన్నది. ఇంకా కూటము యొక్క పెద్ద భాగానికి వెళ్ళకముందే ఈ రోజున, ప్రజలకు, బైబిల్ నుండి పాతకాలపు పద్ధతిలో కొన్నింటిని ఉపదేశించుటకు ప్రయత్నం చేయుటను గూర్చి ఆలోచించుచుంటిని. అలా ఆ గొప్ప సంఘటనలు వచ్చునప్పుడు, దేవుడు అది మనకు పంపినయెడల, అప్పుడు దానిని మనము శ్రేష్ఠముగా అర్ధము చేసుకొనుటకు సమర్థత కలిగి ఉండగలము.5అన్నిటి తరువాత, దైవిక స్వస్థత కేవలము – చేపలు పట్టుటకు గాలముపై ఎర, అవుతుందని మీరు ఎరుగుదురు. అది కేవలము… అధి ఒక్కటే అయి ఉన్నది… చేప ఎరను పట్టుకొనును మరియు గాలమునకు చిక్కుకొనును. కనుక మన ప్రధానమైన మన అంతిమ ప్రత్యామ్నాయము ఇదే, ఏమనగా క్రీస్తు యేసునకు ఆత్మలను సంపాదించుటయే.దేవుడు ఈ రాత్రి నిన్ను స్వస్థపరిచిన యెడల, నీవు చనిపోయే ముందు నీవు మరల రోగివి కావచ్చును. ఇప్పటి నుండి ఒక సంవత్సరములో లేదా ఇప్పటి నుండి రెండు సంవత్సరములలో, నీవు మరలా రోగివి కావచ్చును. నాకు తెలియదు. అయితే అక్కడ నిశ్చయముగా ఒక సంగతి గలదు, ఈ దినములలో ఏదో రోజున నీవు ఈ లోకమును విడిచిపెట్ట బోవుచున్నావు, ఎందుకనగా ఇది కేవలము మాసిక వేయబడినదై యున్నది.అయితే ప్రాణము పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే సంబంధము కలిగి మరియు తిరిగి జన్మించునో నీవు నిత్యజీవము కలిగి ఉంటావు. ఇక్కడ నీకేమి సంభవించినా సరే, నీవు ఎన్నడూ నశింపవు. యేసు చెప్పెను, “నా మాటలు విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు,” అది వర్తమాన కాలము, “నిత్యజీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక;” భూతకాలము, “మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు.” అది మన అందరిని మెథడిస్టులుగా చేసి, మరియు కేకలు పెట్టినట్లుగా చేసి ఉండును, అది చేయదా? (అది నిజము) దానిని ఆలోచించిన, అలా దేవుడే దానిని చేసియుండెను. ఇప్పుడు, అది నా మాట కాదు; అది ఆయనదే (పరిశుద్ద యోహాను 5:24).6పరిశుద్ద యోహాను 6లో, యేసు చెప్పెను, “నా శరీరము తిని, నా రక్తము త్రాగినవాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను అతనిని లేపుదును.” అది నిజము. “నా శరీరము తిని, నా రక్తము త్రాగినవాడే,” అది వర్తమానకాలము, “నిత్యజీవము కలవాడు.” ఇప్పుడు, అది “నిత్యత్వము” అయితే, అది కేవలము ఒక ఉజ్జీవము నుండి మరొక దాని వద్దకు వెళ్ళుట కాదు, కాని అది నిత్యత్వము వరకు వెళ్ళును.మరియు ఇప్పుడు, ఇక్కడ కూర్చిండియున్న సేవకులలో కొందరు, ఏమనగా అది

“నిత్యజీవము” అనునది “దేవుని యొక్క జీవము,” అను అర్ధమిచ్చు గ్రీకు పదమైన “జో” నుండి వచ్చినది, అనగా “దేవుని యొక్క స్వంత జీవము,” అని ఎరిగియున్నారు.7అప్పుడు, దేవుని యొక్క జీవములో భాగమును మనలో కలవారమై, దేవుని యొక్క కుమారుడు లేదా కుమార్తెగా, దేవుని సంతానమై యుందుము. దేవుడు నశించనివాడు గనుక, ఒకవేళ ఆయన మనలను పరీక్షించినయెడల మనము కూడా నశింపము. కాబట్టి మనము నిత్యజీవము గలవారమై యుండి, అంత్యదినమున లేపబడుదుము. అది అద్భుతం కాదా? అది బాప్టిస్టులను, మెథడిస్టులను కరచాలనము చేయువారిగా మరియు కేకలు పెట్టువారిగా చేస్తున్నది. అది అలా చేయదా? నిశ్చయముగా చేయును. అది నిజము.పాత-కాలపు భక్తిని గూర్చి అది ఒక మంచి విషయము. అది ప్రతి ఒక్కరూ కలసి కూర్చుండి మరియు ఒకరినొకరు ప్రేమించుకొనునట్లు చేయును. నిశ్చయముగా అది చేయును. అది భేదాభిప్రాయములను తొలగించి, నూతన సృష్టిగా చేయును. అది టక్సిడో కోటు ధరించి మరియు ఒక జత ఓవరాల్స్ (పైన ధరించు దుస్తులు) ధరింపజేసి, వారి చేతులు నడుము చుట్టూ ఉంచి “సహోదరుడా, ఎలా ఉన్నావు?” అని చెప్పునట్లు చేయును. అది నిజము. నిశ్చయముగా, అలా చేయును. అది పట్టు వస్త్రము ధరింపచేసి, నడుముచుట్టూ చేతులు చుట్టి, “సహోదరీ, నేను నిన్ను ప్రేమించుచున్నాను,” అని చెప్పునట్లు చేయును. అది అలాగుననే చేయును. అది నిశ్చయముగా చేయును, కేవలం, భేదాభిప్రాయములను చీల్చువేయునట్లు చేయును. “ధనికులైనా లేక పేదవారైనా, దాసులైనా లేక స్వతంత్రులైనా, మనమందరము యేసుక్రీస్తు నందు ఏకమైయున్నాము.”8ఆదివారమున, గుడారము దగ్గర నేను చూచినప్పుడు, ఈ గుడారము యొక్క ప్రజలందరూ ఇక్కడ కూర్చుండిరి. మనము “రక్తము ద్వారా విమోచన” అను ఒక ఆదివారపుబడి పాఠమును కలిగియుంటిమి మరియు నేను అందులో ఎంతగా బాధపడి యున్నానంటే, నేను ఇంకనూ ఎక్కడో మరొక గోళముపై ఉన్నాననే భావన కలిగింది: “రక్తము ద్వారా విమోచన.”మరియు ఈ రాత్రి, పాటల ఆరాధనను వినుటకు కుటుంబమును విడిచి, అలా ముందుగా ఇక్కడికి వచ్చుట. నేను గదిలో ఉంటిని మరియు ఒకలాంటి ప్రేరేపణ ద్వారా… నేను లేఖనములో చదువుట ఆరంభించాను మరియు నేను ఒక దానిని కనుగొన్నాను. “మంచిది, ప్రభువు చిత్తమైతే, ఈ రాత్రి దానిపై కొద్దిసేపు మాట్లాడుతాను,” అని నేను తలంచాను.అదే, రక్తము ద్వారా విమోచన, ఆదివారము. ఇప్పుడు, ఈ రాత్రి నేను “శక్తి చేత విమోచన” పై మాట్లాడబోవుచున్నాను మరియు రేపు రాత్రి “సంపూర్ణతలో విమోచన” పై మాట్లాడబోవుచున్నాను. (ఒకవేళ ప్రభువు చిత్తమైనయెడల, అది) – సంతోషములో. రక్తములో, శక్తిలో మరియు, సంతోషములో; విమోచన!9మరియు దీనిని బయటకు తెచ్చుటకు… ఇప్పుడు, చాలామంది ప్రజలు, చాలా చక్కనివారు, విద్యావంతులైన పండితులు, దానిని ఎలా చేదించి ఈ రకమైన ప్రత్యక్షతను బహుశా, దీనినో, లేక దానినో, లేక దేనినో చూపుట ఎలాగో ఎరిగి యున్నారు. కాని నేనైతే, ఇక్కడున్న విద్యలేని పామరులైన బోధకులలో ఒకని మాదిరిగా నేనున్నాను, అదేమనగా… నేను చేయనెరిగియున్న ఏకైక పని ఏమనగా, నేను ఛాయ యొద్దకు వెళ్ళుటకు, నేను దానికి అతి సమీపముననే ఏ విధము చేతనైననూ ఉండుటను రూఢి పర్చుకొనుటయై యున్నది. ఒకవేళ నేను గోడవైపుకు నడచుట మొదలు పెట్టినయెడల, వెలుతురు నాకు వెనుక వైపున ఉన్నట్లయితే, నేను దేని రూపములో ఉన్నానో అది మాత్రం చెప్పగలను, ఏమనగా ఏ రకమైన ఛాయను నేను ప్రతిబింబించుదునో దానిని చూచినట్లయితే, అది నేను నాలుగు కాళ్ళ జంతువునా, లేక ఒక పక్షినా, లేక అది ఏమైయుండునో నేను చెప్పగలను.10ఇప్పుడు, పాత నిబంధన, కొత్త నిబంధన యొక్క ఒక ఛాయ అయి ఉండెను. అది నెగటివ్ (ప్రింటు వేయని ఫిల్మ్) అయి ఉండెను, ఎలాగనగా సూర్యునికి చంద్రుడు ప్రతిబింభమైనట్లు సూర్యుడు చంద్రుని మీద ప్రకాశించుచుండెను, భూమికి ఆ వెలుగు ప్రతిబింబించును మరియు నేను పాత నిబంధనను ప్రేమిస్తాను! కేవలం అది అలా ఉపమానములతో నిండియున్నది, లేక… అది అలాగే ఉండగలదు. ఇప్పుడు, ఆ పరిపూర్ణత…ఆదికాండములో, దేవుడు మొదట, సూర్యుని, ఆ తరువాత చంద్రుని చేసెను, ఆ చంద్రుడు మరియు సూర్యుడు, క్రీస్తు మరియు సంఘమునకు మాదిరిగా యున్నారు. కేవలము సూర్యుడు తన శక్తితోను, మరియు మహిమతో ఉదయించి, మరియు అది అస్తమించినప్పుడు, అది వెళ్ళిపోయిన తర్వాత, భూమి మీద వెలుగిచ్చుటకు, చీకటిలోని చంద్రుని మీద తన వెలుగును ప్రతిబింబింప చేయును. యేసు, ఆయన వెళ్ళిపోయినప్పుడు, ఆయన మహిమలోనికి ప్రవేశించెను మరియు తాను మరలా వచ్చువరకు సువార్త యొక్క ప్రకాశమును సంఘమునకు ఇచ్చుటకై, తిరిగి తన యొక్క వెలుగును సంఘము మీద ప్రతిబింబింప చేసెను. (ఓ, మై!) మరియు తర్వాత వారు వివాహము చేసుకొనెదరు. అది అద్బుతముగా ఉండును. అది చంద్రుడు మరియు… యొక్క ఒక గొప్ప వెలుగుగా ఉండును. “అక్కడ గొర్రెపిల్లే వెలుగైయుండెను.” పట్టణములో వారికిక సూర్యుడు అవసరము లేదు.11ఇప్పుడు, చిన్న సమీక్ష కొరకు మనము మరలా నిర్గమకాండములోనికి తిరిగి వెళ్ళెదము. నేను నిర్గమకాండములో నుండి మాట్లాడుటను బట్టి మీరు విసుగు చెందరని నేను భావిస్తున్నాను.ఒక సమయములో, నది అవతల ఉన్న మా సంఘములో, ప్రతి రాత్రి, యోబును గూర్చి ఒక సంవత్సరం మరియు ఆరు నెలలు నేను బోధించానని నేను నమ్ముచున్నాను. వారు వెనుకకు వెచ్చెడివారు; నేను యోబులో కొద్ది భాగమును తీసుకొందును, మరియు ముందుకు వెళ్ళుచూ, బైబిల్ గ్రంథము అంతటి గుండా దానిని ధ్యానించి యుంటిమి.ప్రతి లేఖనము ఒకదానితో మరొకటి అమర్చబడి యున్నది. అక్కడ దేవుని వాక్యములో ఎటువంటి వ్యతిరేకత లేదు. లేదండి. ప్రతీది, పరిపూర్ణమైనది! ఆ విధముగా ఆత్మ ప్రేరేపణ వలన వ్రాయబడిన ఒకే గ్రంథము, అది పరిపూర్ణముగా… అనేక రచయితల చేత వ్రాయబడెను మరియు అనేక వందల సంవత్సరముల వ్యత్యాసముతో వ్రాయబడెను; వాటిలో ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ ద్వారా పలుకబడి, సరిగా ఒకదానితో మరియొకటి సరిగ్గా జతచేయబడినవి. ఆ కారణము చేత, ఈ మిగిలిన పుస్తకములన్నియు, మక్కాబీలు మరియు మొదలైనవి, అది దీనితో ఏకముగా జతకూడవు, కనుక నేను దానిని అంగీకరించను. ఇది నాకు దేవుని వాక్యమైయున్నది.12మరియు ఒక స్త్రీ నాకు ఉత్తరము రాసి, ఇలా అన్నాది… నేను బూడిద కుప్పపై నున్న యోబు అను దానిపై ప్రసంగించుచుంటిని. ఆమె, “సోదురుడా బ్రెన్హాం మీరు బూడిద కుప్పపై యోబు గురించి చెపుతూనే ఉన్నారు, ఇప్పటికే కావలసినంత కంటే ఎక్కువగానే కొనసాగిస్తున్నారు అని మీకు అలా తోచడం లేదా? ఇప్పటికి దాదాపుగా ఆరు వారములు దానిపై ఉన్నారు. మీరు ఆయనను బూడిద కుప్పపై నుండి ఎప్పుడు దించబోవుచున్నారు?” అని చెప్పెను.సరే, నేను అన్నాను, “పరిశుద్ధాత్ముడు ఆ మాటలను అక్కడ పంపకుండా ఆపినప్పుడు, కేవలము నేను అప్పుడు దానిని చెప్పుట ఆపవలసి ఉంటుందని నేను అనుకుంటున్నాను.” అయితే బూడిద కుప్ప మీద ఆయన ఉన్న దాని గూర్చి నన్ను మాట్లాడనిచ్చినంత కాలము, మంచిది, నేను కేవలం సరిగా దానితోనే నిలబడి ఉంటిని; మరియు ఆత్మలు రక్షించబడుచున్నవి.13కనుక, ఆ సువార్తీకుడు, నగరమునకు వచ్చినప్పటివలె. ఒకరాత్రి, అతడు బోధించాడు. అతడు మారుమనస్సు పై బోధించెను. ఆ తరువాత రాత్రి అతడు మారుమనస్సు మీద బోధించెను. నాలుగు లేక ఐదు రాత్రులు తరువాత, ఆ డీకన్ బోర్డువారు అతనిని కలిసారు, మరియు “సోదరుడా, మారుమనస్సును గూర్చి కాకుండా మరేదైన వేరొక దానిని నీవు బోధించలేవా?” అన్నారు.అతను అన్నాడు, “ఓ, అవును, వారందరు మొదట మారుమనస్సు పొందనీయండి, అప్పుడు నేను మరొక అంశంపై బోధిస్తాను.” కాబట్టి అది ఒక మంచి ఆలోచన. వారు, ప్రతీ ఒక్కరు మారుమనస్సు పొందినయెడల, అప్పుడు మరో దానిపై మనము బోధించుకొనగలము. మంచిది.14ఇప్పుడు ఒక చిన్న సమీక్ష, ఎవరికనగా… ముఖ్యంగా ఆదివారము ఉదయం గుడారమునందు లేనివారి నిమిత్తము, మనము 12 వ అధ్యాయములోనికి కొంచెము వెనుకకు వెళ్ళాలని కోరుచున్నాను. కాని మన యొక్క ముఖ్యమైన తలంపు 14వ అధ్యాయములో ఉన్నది, నిర్గమకాండము, 13వ వచనముతో ఆరంభమగుచున్నది. ఇప్పుడు, మనము ఆదివారము ఉదయం, “రక్తము ద్వారా విమోచన” అనుదాని గూర్చి, 10వ వచనము దగ్గర విడచిపెట్టాము. మీలో అనేకులు ఆ కథతో పరిచయము కలిగియున్నారనియు, నేను నిశ్చయత కలిగి ఉన్నాను.ఇప్పుడు ఈ గ్రంథములోని పేజీలను వెనుకకు లాగి మరియు ఈ పుటలను త్రిప్పగలము. అయితే అక్కడ ఈ గ్రంథమును తెరువ గల ఒకే ఒకరు ఉన్నారు, అది యేసుక్రీస్తు.యోహాను ఆ

గ్రంథమును చూచెను. అది ముద్రించబడి ఉండెను. “అంతలో పరలోకమందు గాని, భూమిమీద గాని, భూమిక్రింద గాని దానిని విప్పగల మనుష్యుడు ఎవ్వరూ లేనందున అతడు ఏడ్చాడు. అయితే జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల అక్కడ ఉండెను. సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడిచేతనున్న గ్రంథమును తీసుకునెను, మరియు గ్రంథమును విప్పెను మరియు ముద్రలు విప్పెను. మరియు ఆయన యోగ్యుడై ఉండెను, ఎందుకనగా జగదుత్పత్తి మొదలుకొని ఆయన వధించబడి ఉండెను.”ఈ రాత్రి, మనము ఆయనతో మాట్లాడి, మరియు ఇప్పుడే దానిని మన కోసం తెరువుమని వేడుకుందాం.15ఇప్పుడు, దయ, ప్రేమగల తండ్రీ, యేసుక్రీస్తు నామములో, నీకే మొదటగా మనవి చేసుకొంటూ, నీ యొద్దకు వచ్చుచున్నాము, బయట ఆ తుఫాను భీకరముగా ఉన్నది, వరము ఈదురు గాలుతో విసిరికొట్టుచుండగా, మేమైతే ఇక్కడ నిలబడినవారమై, ఈ కప్పు క్రింద ఆశ్రయులమై నీకు ప్రార్థించుచున్నాము, లోనికి ప్రవేశించుటకు దేవుని ఆలయమును కలిగియుండుటను బట్టి మేమెంతో మీకు కృతజ్ఞులమైయున్నాము. మరియు అక్కడ ఒక దుర్గము, ఒక ఆశ్రయము ఉన్నందులకై మేము నీకు కృతజ్ఞులమైయున్నాము. “యెహోవా నామము బలమైన దుర్గము; నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును,” అని మీరు చెప్పారు. మేము ప్రభువు నామమును ఎరిగి, మరియు దానిలోనికి వచ్చి యున్నందుకు మేమెంతో సంతోషించుచున్నాము.ఇప్పుడు, ఈ రాత్రి, నీవు ఈ వాక్యమును మాకు తెరవజేయుమని, తండ్రి, మేము ప్రార్థించుచున్నాము. పరిశుద్ధాత్ముడు వచ్చి మరియు వాక్యములోనికి ప్రవేశించును గాక. ఈ దీనమైన అణకువగల సేవకుని పెదవులను మరియు వినుచున్న నీ పిల్లలైన వారి హృదయములను సున్నతి చేయండి. పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యమును తీసుకొని, కేవలం ఎక్కడ అది అవసరమైయున్నదో, ప్రతి హృదయములోను దానిని ఉంచును గాక. ఇప్పుడు మమ్ములను దీవించుము. ఈ రాత్రి, నీ ఆత్మలో, మా మనస్సులను నూతనపరచుము. ఆరాధనను బట్టి మహిమ తెచ్చికొనుము. నశించినవారిని రక్షించుము; వ్యాధిగ్రస్తులను స్వస్థపరుచుము, ప్రభువా. వెనుకకు జారిపోయిన వారిని గృహమునకు తీసికొని రమ్ము. మేము మీకే స్తుతి చెల్లించుచున్నాము, ఈ ప్రార్ధన నీ ప్రియ కుమారుడైన, యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.16ఇప్పుడు నిర్గమకాండము 12వ అధ్యాయము 10వ వచనము వైపు త్రిప్పెదము. “రక్తము ద్వారా విమోచన” గూర్చి మనము చదివి ఉన్నాము, ప్రతి ఇంటిలో వధించబడుటకు ఒక గొర్రెపిల్లను దేవుడు ఏలాగు ఆజ్ఞాపించెనో, ఏలాగు అక్కడ ఏదియు విడచిపెట్టబడ కూడదనియు చదువుకున్నాము.ఆ న్యాయతీర్పులన్నియు పడుచున్నవి, మరియు తుది న్యాయతీర్పు ఇప్పుడు పడుటకు సిద్ధముగా ఉండెను. అక్షరార్ధముగా, దేవుడు ఆయన వాక్యమును నెరవేర్చనై ఉండెను. పూర్వము అక్కడ ఉండియుండిన ఆ తీర్పులన్నియు, ప్రస్తుత కాలములో వచ్చుటకు సిద్ధముగా ఉన్న తీర్పునకు ఒక పరిపూర్ణమైన సూచన, లేక ఒక పరిపూర్ణమైన మాదిరియైయున్నవి.మరియు మీరు గమనించిన యెడల, న్యాయ తీర్పు జరుగుటకు ముందు, ఈ విషయము ఖచ్చితముగా సరియైనదిగా ఉండినప్పటికిని సేవకులు, ఈ విషయముపై నాతో విబేధించవచ్చును. అయితే ఐగుప్తును న్యాయతీర్పు మొత్తుట ఆరంభము కాక ముందే, దేవుడు ఇశ్రాయేలీయులను గోషేనుకు పంపెను. వారు గోషేనులో ఉన్నారు, మరియు ఏ తెగులు వారిపై పడలేదు. శ్రమలను దాటుకొని సంఘము కొనిపోబడును అనుటకు అది ఒక పరిపూర్ణమైన పోలికగా ఉన్నది, చూశారా. మంచిది.17అటు తర్వాత అక్కడ, భూమిని కొట్టిన లేదా ఐగుప్తును కొట్టిన చిట్టచివరి తెగులు మరణమై యుండెను. ఇక్కడ బైబిల్ చదువే మీరందరు, మీ ఆదివారపు పాఠశాలలో బహుశా, ఇలాంటివి అనేక సార్లు మీకు బోధించబడుట ఎరిగి యుండెదరు. కానీ ఐగుప్తును మొత్తిన చివరి శత్రువు మరణము.ఆత్మీయముగా మాట్లాడితే, ఇపుడు సంఘమును మొత్తనైయున్న చివరి శత్రువు మరణమైయున్నది. పరిశుద్ధాత్మ బాప్తిస్మములో ఎవరు క్రీస్తును వెంబడించరో, ఆత్మ సంబంధముగా ఎండిపోయి మరియు చనిపోవుదురు; సంఘములను, ఇప్పుడు మీరు చూడగలరు. చాలా, చాలా గొప్ప ఉజ్జీవముల తర్వాత మరియు సువార్తీకులు దేశమంతయూ సంచరించిన పిమ్మట కూడా, ఇంకనూ సంఘము అది రాజకీయ సంఘముగానే పిలువబడుచూ, కాలమంతటిలో ఇంకనూ చెడిపోయినదిగా మారుచుండెను. దాని యొక్క సభ్యులు ఇంకనూ వారికి ఇష్టమైన విధముగానే జీవిస్తూ, తమకు ఇష్టమైన కార్యములనే జరిగించుచూ, ఇంకనూ, తాము క్రైస్తవులమై యున్నామని చెప్పుకొనుచున్నారు, మరియు వారు బాగున్నామని చెప్పుకొనుచున్నారు..ఒక క్రైస్తవుని వలె ఉండుట, అనగా “క్రీస్తు-వలె” ఉండుట. క్రీస్తు వచ్చియెడల నీకు ఇష్టము కాని ఏ స్థలానికి వెళ్ళవు. క్రీస్తు వచ్చినప్పుడు చెప్పుటకు నీకు ఇష్టము కాని దేనిని చెప్పవు. క్రీస్తు వచ్చినప్పుడు చేయుటకు నీవు కోరుకొనిన దానిని ఏమియు చేయవు. క్రీస్తు వచ్చినప్పుడు ఆలోచించుటకు నీవు ఆలోచించుటకు ఇష్టపడని దానిని ఏదీ ఆలోచించవు. నీ హృదయమును కల్వరిపైనే కేంద్రీకరించుట, అనే ఏకైక ఉద్దేశ్యమును కాపాడుకొనుము. ఆమేన్. “ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, వెలుగులో నడుపుము. మరియు మనము ఒకరితో మరొకరు సహవాసము కలిగి ఉండవలెను. మరియు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తము సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేయును. అది మెథడిస్టులను, బాప్టిస్టులను, మరియు మనలను అందరిని ఏకము చేసి ఆయనలో మన అందరినీ ఒక్కటిగా యుండునట్లు చేయును.18ఇప్పుడు, చివరిది…. చివరిది మరణము అయి ఉండెను మరియు ఆ మరణము వచ్చుటకు ముందుగా, ఆ మరణము నుండి తప్పించుకోవాలనే ఆశ గలవారందరి కొరకై, అక్కడ దాని నిమిత్తము ఒక ప్రాయశ్చితార్ధమైన బలి జరిగియున్నది.మొదటిసారిగా జల ప్రళయముచేత లోకము నాశనము కాక ముందు, అక్కడ ప్రాయశ్చిత్తార్ధ బలి జరిగెను. దేవుడు నీతిమంతుడైన, నోవహు అను ఒక బోధకుని కలిగి యుండెను మరియు అతడు ఆ ఓడలోనికి ప్రజలు వచ్చుట కొరకు 120 సంవత్సరములు బోధించెను మరియు వెళ్ళుటకు ఇష్టపూర్వకముగా నిరాకరించిన వారికి అక్కడ తీర్పు తప్ప మరేదియు మిగలలేదు.మరియు ఈనాడు, క్రీస్తు యొక్క వెలుగులో నడచుటకు తిరస్కరించిన మనుష్యుడా, నీవు కృపను తిరస్కరించావు. కనుక అక్కడ తీర్పు తప్ప ఏమియు మిగలలేదు. అంతే. అక్కడ కుడి ప్రక్క లేదా ఎడమ ప్రక్క మాత్రమే నీకున్నది, దీనిలో ఏదో ఒక వైపుకు మాత్రమే వెళ్ళుటకు నీకు వీలగును, మరియు నీవే ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవలసి యుండును.19ఇప్పుడు, మనం చూచినట్లయితే, ఆ భయంకరమైన రాత్రి రాక ముందే, ఆ ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించబడెను. దానిని ఇదివరకే మనం తీసుకున్నాము, అదేమనగా గొర్రెపిల్లను వధించుట.ఐగుప్తులో నుండి వాగ్దాన దేశములోనికి తీసికొని వచ్చుటకు దేవుడు తన సంఘమును నిర్గమములోనికి తీసికొని వచ్చుచున్నాడు. నేనది ఇష్టపడుచున్నాను. వారు ఆ దేశమును స్వాధీనము చేసికొనుటకు వెళ్ళుచున్నారు. దేవుడు వారికి ఆ దేశమును ఇచ్చాడు మరియు అయినను అది పెద్దవైన గొప్ప భవనములతో, మరియు రక్షణగా నిర్మించిన వాటితో, అంతా ప్రహరి వేయబడి ఉండెను మరియు యెరికో చుట్టూ గోడలు; దాని చుట్టూ రథములు పరుగెత్తగలవు. కేవలం మరి దాని గూర్చి ఆలోచించు, అయినను, దేవుడు చెప్పెను, “నేను దానిని మీకు ఇచ్చాను. అది మీదై ఉన్నది.” అయితే వారు పరిశుభ్రం చేయవలెను, అది శుద్దికావలెను.20మరియు ఈనాడు దేవుడు చేసినది అదే. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అది కోరినవారికి ఆయన మీలో ప్రతి ఒక్కరికీ ఇచ్చాడు. అయితే నీవు లోపలికి వెళ్ళి దానిని స్వాధీనము చేసుకోవాలి, అంతే; విభేదాలు బయటకు పారద్రోలుము, మరియు గోడలను విరగగొట్టుము, మరియు దాని లోపలకు వెళ్ళి మరియు దానిని పొందుకొనుము.మీరు అనవచ్చు, “అది ఈ రోజు మనకు చెందినది కాదు,” అని పాస్టరు చెప్పారు. కేవలం దానిపై నడచుచూ సాగిపో. “నిన్ను ఇంటిలో నుండి వెళ్ళగొట్టెదను,” అని అమ్మ చెప్పినా. దాని మీదనే నడిచి సాగిపో. “నిన్ను విడిచిపెట్టేస్తాను,” అని నీ భర్త చెప్పవచ్చు; దానిమీదనే సాగిపో, అంతే. నీవు వెళ్ళి దానిని స్వాధీన పర్చుకోవలసియున్నది. అంతే.దైవిక స్వస్థత మీలో ప్రతి ఒక్కరికీ చెందినది. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతీ ఒక్కరూ క్యాన్సర్ తో గుండెపోటుతో అది ఏమైనప్పటికిని, దేవుడు వాగ్దానమిచ్చి యున్నాడు మరియు అది మీదే అయి యున్నది. అయితే నీవు వెళ్ళి మరియు దానిని స్వాధీనము చేసికొనవలసి యున్నది.ఇప్పుడు నీవు అంటావు, “సరే, కేవలము నాకు అంత బాగున్నట్టు అని పించుటలేదు.” దానితో దానికేమియు సంబంధములేదు. ఆ వాగ్దానము మీది. దేవుడు అది మీకు ఇచ్చెను. కేవలము లోపలకు వెళ్ళి మరియు ఒక ప్రక్కనుండి మరొక ప్రక్కకు తరిమి ఫిలిష్తీయులను చంపండి. మరియు హిత్తీయులు మరియు అమోరీయులు అందరిని బయటకు తీసివేయండి; వారిని చంపివేయండి. లోపలకు వెళ్ళండి, దానిని తీసికొనండి. దేవుడు చెప్పెను, “అది మీది, వెళ్ళి దానిని పొందుకొనుము.”21అయితే ఆయన ఇలా అనలేదు, “ఇప్పుడు నేను లోనికి వెళ్ళి, అది అంతా బయటకు తుడిచివేసి, మరియు మీకు కొన్ని చక్కని పట్టణములను కట్టుదును, మరియు మిమ్మును వీధిలో తేలికగా కూర్చుండబెడతాను.” ఆయన ఆ విధముగా చేయడు.ఆయన అది మీకు ఇచ్చును. మరియు నీవు ఒకటి చేయవలసి ఉన్నది. నీకు ఆ దేశము ఇచ్చుటకు ఆయన చాలినంత మంచివాడు. ఆయన మీకు సహాయము చేయుదుననియు, మరియు మీతో ఉందుననియు చెప్పెను; వెళ్ళి, దానిని తీసికొనుము!మరియు ఈ రాత్రి నీకు వ్యాధి ఉన్నయెడల, కుంటివారు, గ్రుడ్డివారు, చెవిటివారు, మూగ నీవు ఏమై ఉన్నప్పటికి; వెళ్ళి, దానిని తీసికొనుము. అది మీది, అని దేవుడు చెప్పెను. అది మీ స్వాస్థ్యము. దేవుడు దానిని మీకు ఇచ్చెను.22ఆ దేశమును వారికి ఇచ్చుచునని ఆయన వారికి చెప్పెను. ఆ స్థలము ఎక్కడ ఉన్నదో వారిని తీసికొని వచ్చుటకు మార్గములో వారిని గూర్చి శ్రద్ధ తీసికొనుటకు వారికి ముందుగా దూతను పంపెను.అక్కడకు వెళ్ళిన వేగులవారి వైపు చూడండి. వారిలో పదిమంది వెనుకకు ఇక్కడకు వచ్చి అన్నారు, “ఓ, మేము దానిని చేయలేము. అది అసాధ్యము. ఏలయనగా మేము శాస్త్రవేత్తలము మరియు మేము ఆ విషయము పరిశీలించి చూశాము. అది శాస్త్రయుక్తముగా అసాధ్యము. మనము అది చేయలేము.”కానీ అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వారిలో ఒకని పేరు యెహోషువా మరియు ఒకని పేరు కాలేబు.

శాస్త్రీయ కోణము ఏమై ఉండెనో వారు దాని వైపు చూడకుండెను. వారు దేవుడు ఏమి చెప్పెనో దాని వైపు చూచుచున్నారు. వారన్నారు, “మనము దానిని చేయగలము.” మరియు అది నిజము. మరియు అది ఒక మంచి దేశమై ఉండెనను ఒక రుజువు వారు తమతో తీసికొని వచ్చారు.ఆ రుజువును గూర్చి నేను సంతోషముగా ఉన్నాను. మీరు లేరా? అలా అక్కడ మనకు పైగా ఒక మంచి దేశము ఉన్నది! మరియు ఈ రాత్రి, మనము రహదారిపై ఉన్నాము. హల్లెలూయ! మంచిది.23ఇప్పుడు వారు దాదాపు విమోచన దగ్గరనే యుండిరి. ఇశ్రాయేలీయుల పిల్లలు ఈ గొర్రెపిల్లను వధించి, దానియొక్క రక్తమును ద్వారబంధముపై, తలుపు యొక్క పై భాగములో ప్రోక్షించుకొని, అలా ప్రతీ యొక్క ద్వారముపై వారు ఆనవాలు కలవారై, రక్షింపబడుటను గూర్చి నిశ్చయతగలవారై యుండాలని దేవుడు కోరెను.మరియు వారు లోపలకు వెళ్ళవలసి యున్నది మరియు ఈ గొర్రెపిల్లను దానిలో ప్రతి భాగమును తినవలెను, గమనించండి, గొర్రె అంతయు; కేవలం దానిలో భాగము కాదు. దానిలోని ప్రతి భాగమును తినవలసి యున్నది.కొంతమంది ప్రజలు అందురు, “నేను కేవలం ఈ భాగమునే తీసుకొందును మరియు నేను ఈ భాగమునే నమ్ముతాను.” అయితే నీవు దానిని అంతయూ తీసికొనవలసి యున్నది, అందులోని ప్రతీ ముక్క కూడా. అందరు, ఓ, మన అపరాధముల నిమిత్తం ఆయన గాయపరచబడెను అని నేను నమ్ముదును, అయితే, ‘ఆయన పొందిన దెబ్బలచేత,’ దానిని గూర్చి నాకు తెలియదు. మనము అది అంతయు కోరుచున్నాము. దానిలోని ప్రతిదానిని తినవలసి యున్నది. అది అంతయును తినవలెను దానిలో కొంత కఠినముగా యుండును, అయితే ఏ విధముగా అయినను, అది మనము తినవలసియున్నది. దేవుడు అలా చెప్పెను.24ఇప్పుడు 10వ వచనము గమనించండి.ఉదయ కాలము వరకు దానిలోనిది ఏదియూ మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను.మరియు ఇప్పుడు ఏదియు మిగిలింపకూడదు; ప్రతిదియు. ఇప్పుడు, ఆయన చెప్పెను. “మీరు అది తినునప్పుడు, ఉడికి ఉడకనిది తినకూడదు, లేక నీళ్ళతో వండబడనిదైనను తిననే తినకూడదు, అయితే మీరు బాగుగా ఉడికినది తినవలెను.” నేను అది ఇష్టపడుచున్నాను.ప్రజలు దేవుని వాక్యమును తినుటకు ప్రయత్నించుచున్నారు, మరియు వారు ఉడికి ఉడకనిది తీసికొందురు; పళ్ళ మధ్య పెట్టి నమలుచూ యుందురు, అంతలో దానిని ఉమ్మివేయుదురు మరియు ప్రతీ ఇతరమైనది తీసికొందురు, “ఓ కేవలం నేను అది తీసికొనలేను. నేను దానికై నిలబడలేను,” అని అంటారు. అది చాలినంతగా వండబడలేదు. అది అంతే.ఆయన చెప్పెను, “అగ్నితో దాని కాల్చవలెను.” అగ్ని పరిశుద్ధాత్మను సూచిస్తుంది. మొదటగా, నీ హృదయములో దేవునిని ఉంచుకొనుము మరియు అదియే నీ కొరకు దానిని వండును. అదే నిజాము. బాగుగా ఉడికించుము; రుచి వచ్చునట్లుగా వండుము, అప్పుడు అది మంచి రుచిగా ఉండును.25ఇప్పుడు, నీవు అలాగే బయట నిలచి, “ఓ, ఒకవేళ అది నా కొరకో, కాదో నేను ఎరుగను. అది బహుశా, గతించిపోయిన దినముల కొరకే అయి ఉండవచ్చు,” అని చెప్పవద్దు. మొదట పరిశుద్ధాత్మను పొందుకో మరియు అప్పుడు నీవు దైవిక స్వస్థత అనగా ఏమిటో గమనించుము.అది వచ్చునట్టుగా ఇక్కడ ఆ గొర్రెపిల్లను వండుటకు నీవు పరిశుద్ధాత్మను పొందినప్పుడు, హృదయాన్ని కదిలించే భక్తి ఏమిటో నీవు చూడగలవు. ఆమేన్. అది సరియైనది. మొదట గొర్రెపిల్లను వండుము. మరియు అది వండుటకు నీకు అగ్ని కావలెను. దానిని కాల్చవలెను. ఓ, మై! అప్పుడే అది మంచిగా ఉండును: దానిని కాల్చుము. అదియే సమస్తమును కాల్చివేయును…26ఈ మధ్య నేను ఇక్కడ పెద్ద కొలిమి దగ్గర నిలబడ్డాను. మరియు ఆ అగ్ని ఎంత వేడిగా ఉన్నదో గమనించాను మరియు కేవలము అది మరిగించి, మరిగించి, మరిగించి మరియు అది వేడి పొందగానే ఆ లోహాలలో, బంగారములో, చెత్త అంతా పైకి వచ్చును మరియు వారు చిలకరింతురు. మరియు వారు ఆ కొలిమిలో ఇంకా కొంచెము వేడిగా, అగ్నిని వేడిగా వారు చేసి ఉందురు. మరియు ఇది ఇంకా ఎక్కువ మరిగించగా, ఇంకా కొన్ని పదార్థములు అగ్నశిల మరియు పదార్ధము, దాని నుండి వచ్చును.మొదటగా పైకి వచ్చునది మురికి, మట్టి మురికి వంటిది. ఆ తరువాత పైకి వచ్చునది ముతక లోహములవంటివి, ఓ, వ్యర్ధమైనది; కొంత పాదరసము లాంటిది, మరియు ఇవన్నియూ, అవి పైకి వచ్చి, పైన మీగడ వలె పేరుకుంటాయి. అలా వారు వెళ్ళుచూ, అలాగే వెళ్ళి చివరగా తీసిన పదార్ధమేమనగా, యిత్తడి లాంటి పదార్ధమైయున్నది. అది అచ్చము బంగారమును పోలి ఉంటుంది, కాని బంగారము కాదు, పనికి రానిది; అదే విధముగా, సరిగా మరిగించుచుండగా, ఇంకా అలాగే మరియు చివరి వస్తువు దాని నుండి వారు తీసినది అగ్నిశిల, అది మోసకరమైన నకిలి బంగారము.27నీవు క్రైస్తవుడైన తరువాత ఒకరి నొకరు మోసపుచ్చుటను లేక ఏ విధముగా అయినను దానివలె నటించుచుందురనియు అలా అక్కడ అనేకమైన సంగతులు కలవనియు మీకు తెలియును, చూశారా. అయితే కేవలం ప్రతి సంగతియు మరగబెట్టి బయటకు తీయునట్లు నీవు పరిశుద్ధాత్మను వెళ్ళనిచ్చినయెడల, నీలో నుండి నకిలీ బంగారమును కూడా తీసివేయును.నకిలీ బంగారము: దానికోసం అనేక మంది పశ్చిమ దిశకు వెళ్ళెదరు. దానిలో కొంత భాగమును కనుగొని, వారు అనుకొంటారు, ఓ, ఒక బంగారపు గనిని కనుగొన్నాము అని వారు అనుకుంటారు. అది బంగారము కంటే బాగా ప్రకాశించును. అయితే అది నకిలీ బంగారము: దానికి ఏ విలువ ఉండదు.ఇప్పుడు వారు దానిని కరిగిస్తారు, దానినంతా మరిగిస్తారు, అది అలాగే మరుగుతూ ఉంటుంది, నూటికి నూరుశాతం స్వచ్ఛమైన బంగారముగా మారువరకు అది మరుగుతూ ఉంటుంది.దేవుడు ఆ విధముగానే ఆయన సంఘములో చేయును, దానిపై పరిశుద్ధాత్మను కుమ్మరించి సమస్త లోకమును, స్వార్థమును, విభేదములను ఇది అంతా కూడా ఆయన బయటకు త్రోసివేయు వరకు మరిగించును, ఆయన యొద్దకు వచ్చు ప్రతివానిలో నుండి అంతా తీసివేయు వరకు మరిగించును, ఉడకబెట్టును. ఆమేన్.28ఇప్పుడు, ఆ తరువాత, నీవు అది తినగలవు. ఇక్కడ మరొక మనోహరమైన తలంపు గలదు, 11వ వచనము.“మీరు దానిని తినవలసిన విధమేదనగా; (ఇది ఆలకించుడి)… మీ నడుము కట్టుకొని, (నేను అది ఇష్టపడుచున్నాను)… మీ చెప్పులు తొడుగుకొని… మీ కర్రను చేతపట్టుకొని, త్వరపడుచు దాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి.”నేను దానిని ఇష్టపడుచున్నాను. మీరు భుజించుచుండగా వెళ్ళుటకు సంసిద్ధముగా యుండుడి. అదే విషయము.29మనము ఎఫెసీ వైపుకు వెళ్బుదము. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయమును గూర్చి, సంఘము యొక్క సిద్దపాటును గూర్చి పౌలు ఇక్కడ ఏమని చెప్పాడో చూడుము; ఎఫెసీ 6వ అధ్యాయము, 6వ అధ్యాయము 14వ – వచనము ప్రారంభము నుండి.ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొనిపాదములకు సమాధాన సువార్తవలననైన సిద్దమనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి;ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి:చూడండి, యుద్దమందు కొనసాగిపోవుట కొరకు ఒక మనుష్యునికి పౌలు వస్త్రధారణ చేయుచున్నాడు.దేవుడు, ఇశ్రాయేలీయులను విడిపించిన ఆరంభములో, ఆయన నీవు సాగిపోవుటకు సిద్ధపడియుండవలెను. నీవు రక్తము క్రిందకి వచ్చినప్పుడు, నీ పాద రక్షలను ధరించుము. నీ నడుమును కట్టుకొనుము. నీ చేతి కర్రను పట్టుకొనుము, మరియు నీవు పిలుపు కొరకు సిద్దపడుము,“ అని చెప్పెను. దానిని నేను ఇష్టపడుదును.ఇప్పుడు ఒక మనుష్యుడు, క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు, సువార్త బోధించుటకు జోడు (చెప్పులు) తొడుగుకొంటాడు; రక్షణయను శిరస్త్రాణమును ధరిస్తాడు; నీతియను మైమరువును కలిగి; నడుముకు దట్టి కట్టుకొంటాడు.30సాధారణముగా, పురాతన సైనికులు, వారు యుద్దోపకరణములు ధరించునప్పుడు, వారు ఒక పెద్ద దట్టీ కలిగి ఉండిరి, శత్రువు యొక్క ఈటెలను నియంత్రించుటకు, ఈ డాళ్ళను, వారి నడుములకు పైగా పట్టుకలిగి ఉండునట్లుగా, వారు దానిని కలసి ఉండునట్లు గట్టిగా కట్టుదురు. మనకు అది ఏలాంటి నిజమైన పాఠమైయున్నది. అంతలో అప్పుడు ఆ నడుము బలహీనమగుటకు ప్రారంభమై, ఆ డాలు, క్రిందకు వ్రేలాడుచుండగా, వారు వారి బెల్టును పైకిలాగి బిగించుటకు, వాటిని మరల గట్టిగా బిగింతురు.ఈనాడు అది ఏలాంటి ఒక పరిపూర్ణ చిత్రమైయున్నది: ఇప్పుడైతే తగిన శ్రద్ద లేకుండునట్లు నీకు భావము కలుగుటకు ప్రారంభమగునో, లేక “అది పనిచేయదు,” అని సాతానుడు చెప్పినప్పుడు, వదులైన ఆ దట్టీని మరలా కొంచెము బిగించి కట్టుకొనుము, చేతిలో ఖడ్గము కొంచెము గట్టిగా పట్టుకొని, మరియు ముందుకు సాగుము. నేను దానిని ఇష్టపడుదును. కదం తొక్కి సాగిపోవుట కొరకు సిద్ధముగా ఉండుము.ఆ రక్తము క్రింద నడుచు ప్రతి మనిషి, ఆ రాత్రి అక్కడ నిలబడి ఉండుటకు, కొనసాగిపోవుటకు, ఆజ్ఞలు వచ్చు వరకు, బయటకు వెళ్ళకూడదు, అని ఆజ్ఞాపించబడెను.31మరియు దేవుని ఆత్మచేత జన్మించిన ప్రతి మనుష్యుడు, క్రీస్తులోనికి వచ్చినవారై, నిత్యజీవమును కలిగియుండును. అతడు తన డాలును ధరించి, మైమరవును కలిగి సిద్దముగా నిలువబడియుండి, ఆదేశాలు వచ్చువరకు, కవాతు చేయుటకు ఆ స్థలమును వీడుటకు నిషేధించబడిరి.ఓ, అది మరపురానిదిగా లేదా? సైనికులైన మీరు, ఈ రాత్రి, అది అంతయూ అలా మీరు జీనును ధరించి ఉన్నందుకు మీరు సంతోషించుట లేదా?32ఈ గుడారము యొద్ద పాడుటకు ఒక పాటల నాయకుని కలిగి ఉండగా, మనకు ఇతివృత్తముగా ఉన్న ఈ పాట:ఓ క్రైస్తవ సైనికులారా, యుద్ధము జరుగుచున్నది,ముఖాముఖిగా కఠినమైన యుద్ధ ప్యూహములో,రంగుల వెలుగులో, కవచముల ప్రకాశముతో,ఈనాడు మంచి చెడుల నడుమ పోరాటము;యుద్దము జరుగుచున్నది, బలహీనుడవు కావద్దు,బలము కలిగి ఉండుము,ఆయన శక్తి నిన్ను పట్టి నిలుపును.దేవుడు మన కొరకు ఉన్నయెడల,ఆయన ధ్వజము మనపై ఉన్నది,చివరకు మనము విజయ గీతము పాడెదము.పురాతన సైనికులలో చాలమంది సమాధికి వెళ్ళారు, అయితే ఈ రోజులలో ఏదో ఒక రోజు సుదూరాన కొత్త ప్రపంచములో వారు వాగ్దాన దేశానికి వచ్చినప్పుడు, సిలువ ధ్వజము మనకు పైన ఉండును మరియు మనము విజయ గీతము పాడెదము. ఆ రాత్రి మనం పెండ్లి విందు దగ్గర కూర్చున్నప్పుడు, బల్లచుట్టూ, ఆ గొప్పబల్ల 100 వేల మైళ్ళ పొడవు ఉండవచ్చు. అక్కడ రక్తముతో కడుగబడిన పరిశుద్దులు కూర్చుందురు. నేను ఆ బల్ల దగ్గరకు వెళ్ళి మరియు వారిలో ప్రతీ ఒక్కరితో కరచాలనము చేయగోరుచున్నాను (ఆమేన్), కేకలు వేయుదును. మీరు నేను అలా కేకలు వేయుట వినగోరుచున్నారా? నేను అక్కడకు వెళ్ళే వరకు కనిపెట్టండి; నన్ను గమనించండి. దీని కొరకు ఇంకా, నేను తగినవానిగ లేను. అయితే, గమనించండి, నేను సాగిపోవుచున్నాను. ఆ కవాతులో నేను సాగుతున్నాను. సిద్దపడండి. మనం వెళ్ళుచున్నాము.33ఇక్కడ ఒక విచారకరమైన చిత్రము ఉన్నది, మన క్రమమైన పాఠములోనికి వెళ్ళుటకు ముందు, అక్కడ 38వ వచనములో గమనించండి.మరియు ఒక మిశ్రమ సమూహము ఆ మందతో వెళ్ళెను…అక్కడే ఇశ్రాయేలీయులు ఒక పొరపాటు చేసెను. అతీతమైన కార్యము జరిగెను. సహజాతీతమైనది జరిగిన దాని మూలముగ మార్పుచెందని ప్రజలు వెంబడించెను, తుదకు అదే వారిని కష్టములోనికి తీసుకు వెళ్ళెను. మరియు అలా ముందుకు, 42వ వచనము మరియు 43వ వచనము, ఇక్కడ మనము గమనించినయెడల. ప్రభువు మోషేతో మాట్లాడుచూ, చెప్పెను, అది ఏమంటే, బలి అర్పించిన వారే తప్ప అక్కడ ఎవరు… ఆ బలి పదార్థములు ఎవరూ తినకూడదు, కాకుండా ఈ సున్నతి చేయబడిన వారే క్రొత్తవారు కాదు. బయటవారు కాదు, అయితే సున్నతి పొందిన వారే తప్ప దానిని మరెవరునూ దానిని తీసికొనకూడదు.మరియు ఈ దినమున మనము కలిగియున్నది ఎంత అవమానకరమైనదో చూడండి, నా ప్రియమైన స్నేహితులారా; అదేమనగా సంఘములో సంఘమునకు చెందిన వారందరూ ప్రభురాత్రి భోజనమును తీసుకొనుచున్నారు. అది తప్పైయున్నది. కేవలము విమోచించబడిన వారు మాత్రమే యోగ్యులు.34యెషయా పలికి మరియు చెప్పెను, “ప్రభువు బల్లలన్నియూ వాంతితో నిండియున్నవి.” అనెను, “నేను ఎవరికి సిద్దాంతమును బోధింతును? చనుపాలు విడిచిన వారికా?” “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట,” అని చెప్పెను. “మేలైన దానిని చేపట్టుడి.” మనము జీవించు రోజు అలాటిదని ఎరిగి, అనగా సంఘము రాజకీయంగా ఉండునని, దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతవరకనగా ఆ ప్రజలు, లోపలకు వచ్చి, సంఘ పుస్తకములో వారి పేరు ఉన్నంత కాలము, వారు సంఘ సభ్యులుగా ఉండి, వారు ప్రభురాత్రి భోజనము తీసికొనుచూ, ప్రతిదానిని వారు అనుమతించెదరు.మరియు బైబిలు చెప్పెను, “ఆ విధముగా అయోగ్యముగా తిని త్రాగువాడు ప్రభువు శరీరమును గూర్చియు మరియు రక్తమును గూర్చియు అపరాధియగును.” పరిశుద్ద యోహాను, 13వ అధ్యాయములో, యేసు మాట్లాడుచుండెను.II కొరింథియులకు 11వ అధ్యాయము, సంవత్సరముల తరువాత, పౌలు చెప్పెను, అది “అయోగ్యముగా తిని త్రాగువాడు, ప్రభువు శరీరమును గూర్చియు మరియు రక్తమును గూర్చియు అపరాధియగును. ప్రతి మనిషి తన్నుతాను పరిశీలించుకొనవలెను.” అతడు చెప్పెను, “అతడు తీసుకొనక ముందు.” నేను లేఖనము పేర్కొనుచున్నాను. అది నిజము. “అయోగ్యముగా ప్రభువు శరీరమని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునైయున్నారు, చాలా మంది నిద్రించుచున్నారు.” దేవునితో సరిగా నిలచి యున్నారనే నిశ్చయత కలిగి ఉండుము.అది ఇక్కడ ఛాయా రూపములో ఉన్నది, సున్నతి పొందిన వారు తప్ప, మరెవ్వరు కాదు! అతడు ఎంత విశ్వాసపాత్రుడుగా ఉండినా సరే, అతడు ఎంత ఎక్కువగా యూదా సంఘమునకు సహాయము చేసినా సరే; అతడు సహవాస ఆరాధనలో పాల్గొనక మునుపు, లేక ప్రభురాత్రి భోజనము తినక ముందు, అతడు తన ఆచార, వ్యవహారాలను విసర్జించినవాడుగా ఉండవలెను, సున్నతి పొందిన నిజమైన విశ్వాసియైయుండవలెను. ఓ, ఈనాడు వరుసలో నుండి ఎంతో దూరముగా పోయాము!35ఇప్పుడు త్వరగా వెళదాం, అప్పుడు మరియు ఈ రాత్రి దేవుడు వారిని బయటకు తెచ్చెను. ఇప్పుడు మనము 14వ అధ్యాయము 13వ వచనము వైపునకు తిరుగుచున్నాము.వారికి ముందుగా వెళ్ళుటకు దేవుడు వారికి అగ్నిస్తంభమును ఇచ్చెను. ఈ రాత్రి, ఇక్కడ వారు ఆ చిత్రమును కలిగి ఉన్నారనియు నేను తలంచుచున్నాను. మరియు నేను దానిని భయభక్తితో చెప్పుచున్నాను. నా నిజమైన ఉద్దేశ్యం, ఈ రాత్రి మనము ఈ గుంపు మధ్య ఉండగా, ఈ రాత్రి అది మనతో ఉన్నదని నేను నమ్ముచున్నాను. ఇశ్రాయేలీయులు పిల్లలను నడిపించిన అదే అగ్నిస్తంభము, అవే సూచనలు మరియు ఆశ్చర్య కార్యములు చేయుచు మనకు ముందుగా వెళ్ళుచున్నాడు. మరియు ఇక్కడ ఏ ఉపదేశకుడు అయిన లేక బైబిల్ పండితుడైనా ఇశ్రాయేలీయులను వెంబడించిన ఆ దూత, మరియు వాగ్దాన దేశానికి వారిని మార్గదర్శిగా వెంబడించినది, ఆ నిబంధన దూత యేసుక్రీస్తు అయి ఉండెననియు ఎరుగును.మరియు, ఈనాడు, “యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు,” మరియు పరిశుద్ధ గుండ్రాళ్ళు అని మీరు పిలువాలనుకొనే ఈ గుంపు ముందుండి ఆయన నడిపించుచున్నాడు, ఒకవేళ మీరు అలా పిలవాలనుకుంటే. మంచిది. అలా కొనసాగిస్తూ, జయము నుండి విజయమునకు నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రము.36వారి దేశాలలో వారి రోజులలో, వారు అలక్ష్యపెట్టబడిరి మరియు ద్వేషింపబడిరి, తృణీకరింపబడిరి, ఆ దేశముల ద్వారా అణగదొక్కబడిరి, మరియు రకరకాలుగా పిలువబడిరి.కనుక అది ఈ రోజూ, నిజ విశ్వాసితో అలాగే ఉన్నది. మీరు మీ సంఘములలో మీరు ఎరుగుదురు, నీవు క్రీస్తు కొరకు నిలబడినప్పుడు మరియు సత్యము కొరకు మాట్లాడినప్పుడు, సంఘము అంతా అనును, “అతనివైపు చూడండి! అతడు మతి పోగొట్టుకున్నాడు. అతడు పిచ్చివాడయ్యాడు,” చూశారా.దానిని ఎంత మాత్రము లక్ష్యము చేయవద్దు, ముందుకు సాగిపో. నీవు ఇప్పుడు సర్వాంగ కవచము ధరించావు మరియు రక్తము నీకు ముందుగా వెళ్ళుచున్నది; పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించుచున్నాడు. అలాగే కదలుచు వెళ్ళు.

ఎవరు ఏమి అనిననూ లక్ష్యపెట్టకుము. కల్వరి వైపు తిన్నగా చూడు, మరియు కదం తొక్కి నడువుము. అందమైన మాదిరి!37ఇప్పుడు, వారు దాని గుండా బయటకు వచ్చారు… మరియు ఇప్పుడు గమనించండి: రక్త విమోచన వారిని ఐగుప్తు నుండి బయటకు తెచ్చెను, ఇప్పుడు ఆ దేశములోనికి తీసికొని వెళ్ళుటకు వారికి మరేదో కావలసియున్నది. ఇప్పుడు వారు కేవలము బయలుదేరుటకు ప్రారంభించారు. వారు బయటకు వచ్చారు, సున్నతి పొందారు, రక్తము క్రిందకు వచ్చారు, మరియు ముందుకు కొనసాగుతున్నారు. ఇప్పుడు వారు మరొక దాని దగ్గరకు వచ్చారు, వారు మరణము నుండి జీవములోనికి దాటియున్నామని యెరిగినవారై, దానితో కొనసాగుచున్నారు; వారు నిత్యజీవము గలవారని యెరిగియున్నారు.కాని ఇక్కడ వారు, ముందుకు వచ్చుచుండగా, కష్టము పైకి లేచుట ఆరంభమైనది. ఇక్కడ వారిని పట్టుకొనుటకు, ఫరో సైన్యం వారిని తరముచూ వచ్చుచున్నది.వినండి! “దేవుడు మనకు ఆశ్రయము మరియు మన దుర్గము, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు.” ఓ, ఇది మీరు గ్రహించారని, నేను ఆశిస్తున్నాను. అది ఇక్కడ ఉన్నది. వినుము, 13వ వచనము.మరియు మోషే ప్రజలతో చెప్పెను, భయపడకుడి…38నేను దానిని ప్రేమిస్తాను. యేసు మృతులలో నుండి లేచిన తరువాత, ఆయన ఎల్లవేళలా పలికిన మాటలు, “భయపడకుడి.”ఈ రోజు సంఘముతో వచ్చిన కష్టం అదే. నీవు ఓటమి పాలవుతావేమో అని చచ్చేంత భయపడుచున్నావు. నీవు క్రీస్తులో ఉన్నప్పుడు నీవు ఎలా అపజయము పొందగలవు? నీవు ఓడిపోవడానికి వీలులేదు. నీవు నిత్యజీవము పొందియున్నావు. నరకములో ఉన్న సమస్త దయ్యములు నిన్ను కదిలించలేవు. నీవు నిత్యజీవము పొందావు. యేసు ఆ విధముగా చెప్పెను. కనుక ఓటమిని గూర్చి భయపడవద్దు.నీవు అందువు, “నేను మూఢభక్తి గలవాడనైపోతున్నానని భయపడుచున్నాను.” నేను ఊరకనే ఏమీ చేయకుండా కూర్చుని ఉండుటకంటే, నేను విశేషముగా కొద్ది మూఢభక్తి కలిగి యుంటాను. నేను నిశ్చయముగా అలా ఉందును. అలా ఏదో చేయనై ఉన్న ఒక మనిషి….39ఇక్కడే ఉన్న బల్లార్డ్స్ ను గూర్చి అది చెప్పబడెను, అతని దగ్గరకు ఒక ఉద్యోగం కావాలని ఒక వ్యక్తి వచ్చాడు, అంతలో అతడు అనెను, “ఇక్కడ నీ సంతకం చేయుము.” అతడు సంతకం చేయుటకు, అతని పెన్సిలు తీసికొనెను. అతడు అనెను, “తుడిచివేసేది (రబ్బరు) ఎక్కడ ఉన్నది?”“నేను పొరపాట్లు చేయను,” అని అనెను.అతడు అనెను “నేను నిన్ను ఉపయోగించుకొనలేను; నీవు ఏమియు చేయబోవుట లేదు.”అది నిజము. నీవు ఒకవేళ ఏ పొరపాటు చేయనట్లయితే, నీవు ఏ పనిని చేయలేవు. మనము వెళదాము, సోదరుడా, పైకి లేచి వెళ్ళుము. లాంగ్ ఫెలో చెప్పిన దానిని ఇక్కడ ఇష్టపడుదును:దుఃఖపు సంఖ్యలలో, నాకు చెప్పవద్దు,అయితే జీవితము ఒక ఖాళీ కల!ఆత్మ చనిపోయినది అది కునుకుచున్నది,మరియు కనబడునట్లుగా కార్యములు లేవు,అవును, జీవితము నిజమైనది!జీవితం పోరాటమైయున్నది!సమాధియే దాని అంతము కాదు;నీవు మన్నే గనుక, మంటికి తిరిగి వెళతావు,అది ప్రాణమును గూర్చి అలా మాట్లాడలేదు.మనం పైకి లేచి మరియు చేయుదము,ఎలాంటి పోట్లాట కొరకైనను;ఒక హృదయముతో పారద్రోలబడిన పశువు వలె,మూగ దాని వలే ఉండవద్దు!ఒక నాయకునిగా ఉండుము!40నిన్ను క్రీస్తు దగ్గరకు వచ్చునట్లు ఒప్పింపజేయు ప్రజల కొరకు కనిపెట్టవద్దు. ఒక పురుషుడు లేక ఒక స్త్రీ వలె నిలబడి ఉండుము, ఆయనను అంగీకరించుము, మరియు విజయముతో ముందుకు నడువుము. ఆమేన్. అదే దేవుడు కోరునది, కరుకైన, సిద్దపడి ఉన్న సైనికులు. నీవు ఒక వంద మరియు ఐదు పౌండ్లు బరువుగలవానిగా ఉండకపోవచ్చును, అయితే సహోదరుడా, కేవలము దేవుడు ఇష్టపడు విధానమును అనుమతించిన యెడల, శక్తితో నింపబడినవాడవుగా, మరియు నీవు ఇంకా ఆరోగ్యవంతునిగా ఉండగలవు. నేను 200 పౌండ్లు బరువు గల పురుషులను చూచియున్నాను, కాని వారిలో ఒక అనువు వ్యక్తిత్వము లేదు.అందుకు మోషే – భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి…అది మంచిదైయున్నది. కేవలము ముందుకు సాగుము. దేనిగూర్చియు భయపడకుము. నీవు క్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించినయెడల, ముందుకు సాగుము.41“బ్రెన్హాం సోదరుడా, నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మమును కోరుచున్నాను.” కేవలం అలాగే ముందుకు సాగుము. భయపడవద్దు.నీవు అందువు, “బ్రెన్హాం సహోదరుడా, ఇప్పుడు నేను జబ్బుగా ఉన్నాను. ఇక నేను ఎక్కువగా ముందుకు వెళ్ళలేక ఉన్నాను? చింతించవద్దు, కేవలము అలాగే కొనసాగుము; మన ప్రభువు యొక్క రక్షణను చూడుము! దానిని అంగీకరించుము. కేవలము ముందుకు సాగిపొమ్ము.“అది ఏలా జరుగును? ఆ వైద్యుడు నన్ను తిరస్కరించాడు.” ఇప్పుడు, ఆ వ్యక్తి అతడు చేయగలిగినది అత్యుత్తమముగా చేశాడు. కాని దేవుడు తాను చేయగలిగిన అత్యుత్తమమైన దానిని ఇంకా చేసి ఉండలేదు. అది నిజము. కేవలం ఒక నిమిషము, ఇప్పుడు ఆయన చెప్పినది వినండి. మంచిది.ప్రభువు, ఈ రోజు ఆయన మీకు చూపించిన: ఆ ఐగుప్తీయులను… (ఆ అస్సూరీయులు, సత్యము… ఆ బాధపెట్టినవారు).42ఇలా అందువు, “సహోదరుడా బ్రెన్హాం, నేను పొగత్రాగుట మానుకొని ఉన్నట్లయిన యెడల! నేను మద్యపానము చేయుట కేవలము వదలిన యెడల! నేను దొంగిలించుట మానినయెడల! కేవలము నేను ఇది, అది మరియు మరొకటి చేయుట ఆపి ఉండిన యెడల.” చింతించవద్దు. కేవలము ముందుకు నడువుము. మిగిలిన అంతటిని గూర్చి దేవుడు శ్రద్ద వహించును.“సహోదరుడా బ్రెన్హాం, నేను అది చేయగలిగి ఉందునని నేను ఎరిగి ఉండినయెడల, సరిగా ఇప్పుడే నేను క్రీస్తును అంగీకరించి ఉందును. ” నీవు చింతించవద్దు. కదలి ముందుకు సాగుము. కేవలము ముందుకు సాగుము. ప్రభువు యొక్క రక్షణను చూడగలవు!మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు, (ఆమెన్. అది

స్థిరపడును.)యెహోవా మీ పక్షమున యుద్దము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను.అంతలో యెహోవా మోషేను చూచి – నీవేల నాకు మొర్రపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము: (నేను దానిని ఇష్టపడుదును.)43సహోదరుడా బ్రెన్హాం “సరే, నేను పది సంవత్సరముల క్రితము, నేను సంఘములో చేరాను. నేను మంచి నమ్మకమైన సభ్యునిగా ఉన్నాను,” అని చెప్పుటకు ప్రయత్నించకు. అది మంచిది; నేను దానిని ప్రశంసించుదును. కానీ ఈ రాత్రి, ముందుకు సాగుము. దేవుడు కదలుచూ ముందుకు వెళ్ళుచుండెను. ఈనాడు ప్రజలు, ఇక్కడ, వెనుకకు వెళ్ళి, వారు అందురు, “సరేగాని, ఇప్పుడు…”ఒక నూట ఏబది సంవత్సరముల క్రితము, విజ్ఞాన శాస్త్రము, అక్కడ ఫ్రాన్స్ లో విజ్ఞాన శాస్త్రముండెను, అది “ఒక మనిషి ఎన్నడైనా గంటకు 30 మైళ్ళు భీకర వేగముతో వెళ్ళిన యెడల, భూమ్యాకర్షణ శక్తి వానిని భూమి నుండి దూరముగా తీసుకొనిపోవును మరియు అతడు వెళ్ళిపోవును” అని చెప్పెను. హు! గంటకు ముప్పయి మైళ్ళు? ఇప్పుడు అతడు గంటకు పదహారు వందల మైళ్ళు వెళ్ళుచున్నాడు. విజ్ఞాన శాస్త్రము ఆ వ్యక్తికి తన వివరణ ఇచ్చుట నీవు ఎన్నడూ వినలేదు. అతని దినములో, అతడు సరియైనవానిగా ఉండెను, అయితే వారు మరొక దినములో జీవించుచున్నారు. అది నిజము.అయితే బోధకులమైన మనము, ఓ, లేదు. “దైవిక స్వస్థతా? ఇప్పుడు పరిశుద్ధ మూడి, ఫిన్నీ, నాక్స్, కాల్విన్, వారిలో కొందరు దానిగూర్చి ఏమి చెప్పారో నన్ను చూడనివ్వండి.” వారు వారి దినములలో సరియైన వారిగానే ఉన్నారు, అయితే మనము కదలుచూ సాగిపోవుచున్నాము, ముందుకు వెళ్ళుచున్నాము. మనము మరొకటి పొందాము.44అక్కడ ఉపమానములో విత్తువాని గూర్చి, విత్తువాడు విత్తుటకు వెళ్ళి మరియు విత్తనములు విత్తెను, అని యేసు చెప్పెను. ఆ శత్రువు చుట్టు వచ్చి మరియు గోధుమలలో కొన్ని గురుగులు విత్తెను. “వాటిని కలసి ఎదుగనియ్యుడి,” అని ఆయన చెప్పెను.లోకము ఎంత క్రూరముగా మారుతున్నదో నీవు ఎల్లప్పుడూ సూచిస్తూ ఉంటావు, కానీ అదే సమయములో సంఘము ఏలాగు శక్తిని పొందుచున్నదో చూచుటలో నీవు విఫలమయ్యావు. ఆమె పైకి లేచుచూ, రంగము పైన నిలబడు చుండెను. ఓ, ఆమె ఒక చిన్నమందగా ఉన్నది, అయితే సహోదరుడా, దేవుడు ఆమెతో ఉన్నాడు. క్రీస్తు మృతులలో నుండి లేచుట ఎంత నిశ్చయమో, అంత నిశ్చయముగా ఆమె జయించనై యున్నది. ఆమేన్. దేవుని సంఘము ఎన్నడూ తప్పిపోదు. “పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు.” అవి వ్యతిరేకముగా ఉండుండు అని చూపబడెను, కానీ అవి నిలువనేరవు. యేసుక్రీస్తు రక్తము ద్వారా, సంఘము విజయమునకు గుర్తుగా, ఆ సంఘము జయించనైయున్నది. నేను ఈ ఒక్క సంగతిని గూర్చి అనుకూలముగా ఉన్నాను: దేవుడు ముడతా, మచ్చా, కళంకము లేని ఒక సంఘమును కలిగి ఉండెను. ఆమేన్. దానిని గూర్చి నేను సంతోషముగా ఉన్నాను.45ఇప్పుడు, “నేను ఆ సంఘములో యుండినయెడల,” ఆమేన్. “బ్రెన్హాం సహోదరుడా, దానిలోనికి నీవు ఎలా చేరావు, అక్షరము ద్వారానా?” కాదు. “నీవు దానిలోనికి ఎలా ప్రవేశించావు?” పుట్టుక ద్వారా; దానిలోనికి జన్మించాను!నేను బ్రెన్హాం కుటుంబములో ఉన్నాను, ఈ వచ్చే ఏప్రిల్ 6వ తేదికి, 45 సంవత్సరముల వయస్సుకు వచ్చుదును, మరియు వారు ఎన్నడూ వారి కుటుంబములోనికి చేరమని నన్ను అడగలేదు. నేను ఒక బ్రెన్హాంగా పుట్టియుంటిని. నేను ఎల్లప్పుడూ ఒక బ్రెన్హాంగానే ఉంటాను.యేసుక్రీస్తులో నేను ఒక క్రైస్తవునిగా పుట్టియుంటిని. నేను ఒక క్రైస్తవునిగా ఉందును, ఎందుకనగా ఎన్నికచే దేవుడు దానిని అలా నియమించెను. ఆయన ప్రేమించిన ఆయన సొంత కుమారుని యొక్క కృప ద్వారా ఆయన మనలను పిలిచెను, మనం ఆయనను అంగీకరించాము మరియు నిత్యజీవము పొందాము. “ఒక కరచాలనం ద్వారానా?” “ఒక సభ్యత్వము ద్వారానా?” “ఒక ఉత్తరము ద్వారానా?” “ఒక్క ఆత్మ ద్వారా మనమందరము యేసుక్రీస్తు అయిన ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందితిమి,” మరియు అక్కడ దేవుని రాజ్యము యొక్క సహపౌరులము అయితిమి.46ఈ రోజు నేను తలంచుచుంటిని, నేను ప్రార్ధించుచున్నప్పుడు, అదేమనగా ఒకవేళ మనము దానికొరకు జవాబు ఇవ్వవలసిన ఆ రోజు నేడే అయినట్లయితే ఏమౌతుంది. అలా నాకు ముందు ఉన్న తరము కొరకు నేను జవాబు చెప్పనవసరము లేదు, లేదా నా తరువాత తరము కొరకు జవాబు చెప్పనక్కరలేదు. అయితే, న్యాయతీర్పులో ఈ తరము వారితో నిలబడతాను. అంతలో నేను, “అక్కడ ఆ వైపు చూడు: బీరు త్రాగుచూ ఆ సైన్ బోర్డు పైన ఒక స్త్రీ చిత్రము కలదు, ఏదో మరొకటి, శ్వాసలేనిది, లేక ఏదో ఆమె అయి యుండెనని చెప్పెను.” నేను అన్నాను, “అవును, మరియు జీవము లేనిది కూడా.” మంచిది. నీవు అక్కడే ఉన్నావు. నేను అన్నాను, “ఎంతటి అవమానము!”“ఇంతగా బోధించినా,” నేను నా భార్యతో అన్నాను, “కొన్ని సమయములలో అది ఏ మాత్రము మంచి చేయునట్లు అనిపించుటలేదు.” అయితే దాని గూర్చి ప్రజలు ఏమి చేసిననూ దాని వైపు చూడక ఏ విధముగనైననూ, నేను హెచ్చరిక స్వరముగా ఉండవలసియున్నాను. ఏ విధముగామైన, నేను సువార్తను బోధించవలసియున్నది, మరియు యేసుక్రీస్తు శక్తిని గూర్చియూ మరియు పునరుత్థానము గూర్చి సాక్ష్యము ఇవ్వవలసినవాడనై యున్నాను.“ వారు తమ వీపును చూపి మరియు వారు దానిని వదలిపెట్టనీయండి; దేవుడు న్యాయతీర్పు వద్ద దాని కొరకు వారికి తీర్పు తీర్చును. నేను బోధించుటకు మాత్రమే భాద్యుడను, మరియు సువార్తను బోధించే, మిగిలిన సేవకులు కూడా బాధ్యులైయుందురు.47ఇప్పుడు, నేను కేవలం దానిని ప్రేమించెదను. గమనించండి, “ఇప్పుడు ముందుకు సాగుము,” మరియు నీవు దేవుని మహిమను చుస్తావు. కానీ, ఇప్పుడు 16వ వచనము వినండి. మనం ఇది చదివెదము.అయితే…… నీ కర్ర పైకెత్తి……“ఆ కర్ర,” అది తీర్పు కర్రయైయుండెను. ఇప్పుడు, అది మోషే కర్ర కాదు. అది దేవుని కర్రయైయుండెను. నీవు గమనించిన యెడల, మోషే, అతడు ఆ కర్రను తీసికొని, అతడు ఈ విధముగా దానిని పైకి ఎత్తి పట్టుకొనగా ఈగలు వచ్చెను. అతడు దానిని నీటికి మీదగా ఎత్తి పట్టుకొనగా, అది రక్తముగా మారెను. అది దేవుని న్యాయతీర్పు కర్రయైయుండెను, మరియు అదే కర్ర… దానిని గ్రహించండి! అతడు ఆ బండను దేనితో కొట్టెనో అదే కర్రయైయుండెను; మరియు ఆ బండ ప్రక్కలో ఒక పగులు ఏర్పడెను. అంతలో ఆ బండలో నుండి నీళ్ళు వచ్చెను.ఇప్పుడు, ఆ బండ క్రీస్తుయై యుండెను, మరియు అది దేవుని న్యాయతీర్పుయై యుండెను. “నీవు దానిని తిను దినమున, నీవు చచ్చెదవు.” కల్వరిలో క్రీస్తు కొట్టబడెను, మరియు అలా చేదైన, వేదనతో కూడిన మరణమును వెలగా చెల్లించెను. అది ఏమైయుండెను అను దానిని, ఏ మానవుడు ఎన్నడు వర్ణించులేరు. అక్కడ దేవుడు దైవికమైన న్యాయతీర్పునంతా ఆయనపై మోపెను, మరియు ప్రక్కలో ఆయనను పొడిచెను, అప్పుడు మన విమోచన కొరకు, ఆయన ప్రక్కనుండి నీరు మరియు రక్తము మరియు ఆత్మ బయటకు వచ్చెను.48ఏదో సమయములో, ఒక వస్త్రముతో చుట్టబడినవానిగా, లేక ఏదో మరొక దానివలె, సిలువ వైపు, ప్రజలు ఆయన చిత్రమును కొన్నిసార్లు చిత్రీకరించెదరు. అది అలా లేదు. అలా వారు చేయగలిగి ఉన్న ప్రతీ నీచమైనదనియు, హీనమైనదియు చేసి, ఆ మనిషిని వారు వారికి ఇష్టమైన విధానముగా చేశారు; అయితే ఆయన అలా ఉండవలసి యుండెను. అలా ఎన్నడైనా ఉండి మరి ఎన్నడు ఉండబోని లోకమందంతటా మహోన్నతమైనవానిగా మరియు అతి నమ్మకమైనవానిగా ఆయన ఉండెను. మరియు అప్పుడు శరీరముపై బట్టలు లేని దిగంబరిగా సిలువపై బహిర్గతము చేసెను; కొట్టబడిన వానిగా, గాయపరచబడిన వానిగా, రక్తము కారుచున్నవానిగా ఉండెను; హేళన చేయు గుంపులు ఆయన ముఖముపై వేసిన ఉమ్మి వ్రేలాడుచుండెను, ఆయన తలపై ఎగతాళి చేయు ముళ్ళ కిరీటము ఉన్నది. అయితే అక్కడే ఆయన మరణమును, నరకమును, పాపమును, వ్యాధిని, మరియు సమాధిని జయించినప్పుడు మరియు మన అందరి కొరకు వెలను చెల్లించెను.కొన్నిసార్లు, అది తరుచుగా చెప్పబడెను, ఆయన ఎక్కడ మరణములో నుండి ఆ ముళ్ళు తీసాడో అక్కడే, అక్కడే పౌలు ఇలా చెప్పెను, “ఓ మరణమా, నీ ముల్లు ఎక్కడ?”అనేకమైన పురుగులు, తేనెటీగలు మరియు మొదలైన వాటికి ఒక ముళ్ళు ఉండును, మరియు దానితో అవి విషము కలిగియుండును. అయితే అవి ఒకసారి కుడితే, అవి వాటి ముళ్ళును కోల్పోవును.ఒక సమయములో మరణమునకు ఒక ముళ్ళు కలదు; అయితే కల్వరిపై క్రీస్తు మరణములో నుండి ఆ ముళ్ళు బయటకు తీసెను. హల్లేలూయా! ఓ, నేను దాని గూర్చి ఆలోచన చేస్తున్నాను! అక్కడ ఆయన ఆ మరణమునకు ఉన్న ముళ్ళు అంతయూ నా కొరకు మరియు నీ కొరకు మరణము యొక్క ముళ్ళును బయటకు లాగెను.49రోమా చెరసాలలో వారు పౌలు యొక్క తలను నరకబోవుచుండగా అతడు అనెను, “మరణమా, నీ ముల్లెక్కడ?” వెనుక కల్వరి వైపుకు చూపించెను, మరియు అక్కడే మరణములో నుండి ముళ్ళు బయటకు తీయబడినది. “సమాధి, నీ విజయము ఎక్కడ?” అతడు అన్నాడు, “అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు జయము అనుగ్రహించుచున్న, దేవునికి స్తోత్రము.” ఆమేన్. మంచిది.నీవు నీ కర్రను ఎత్తి (న్యాయతీర్పు) ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు.ఇదిగో నేను, నేను ఐగుప్తీయుల హృదయములను కఠినపరుచుదును. వారు వీరిని తరుముదురు; నేను ఫరో వలనను అతని సమస్త సేనవలనను అతని రథములవలనను అతని గుర్రపు రౌతులవలనను నాకు మహిమ తెచ్చుకుందును.నేను ఫరో వలనను అతని రథములవలనను అతని గుర్రపు రౌతులవలనను మహిమ తెచ్చుకొనునప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.మరియు ఆ దేవుని దూత…….వినండి! ఇప్పుడు జీను గట్టిగా బిగించు. “అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సముహమునకు ముందుగా నడిచిన దేవుని దూత…..” ఆయన ఇంకా ఇక్కడే యున్నాడు.ఈ అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట, సముహము యెదుట ముందుగా నడిచిన దూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను: (లేక, ఇక్కడ నుండి వెళ్ళిపోయి, మరియు ఇక్కడ వెనుక నిలిచిపోయెను; ఆపత్కాలములో మధ్యలోనికి వెళ్ళుట.)50కష్టము లేదా ఆపద నిన్ను ఎదుర్కొనుటకు ప్రారంభించినప్పుడు, ఇటు అటు వ్యాధి నిన్ను చుట్టుముట్టినప్పుడు, కష్టములు కలిగినప్పుడు, దేవుని దూత వచ్చి, నీకును మరియు ఆ రోగమునకు మధ్యలో నుండి, మరియు దేవుని వాక్యమును తీసుకొనవలెనని నీకు సవాలు చేయుచు, మరియు అక్కడ మార్గములో నిలబడును.అలా వారు ఆ దేశములోనికి వెళ్ళుదురని, దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానము ఇచ్చెను. బహుశా పది లక్షల మంది మనుష్యులు వచ్చుచుండగా, వారిని తరుముచూ, వారిని వెంటాడుచు, ఒక జంతువుల గుంపు వలె అక్కడ ఉండెను. అయితే ఎవరైతే వాగ్దాన భూమికి వారిని తీసికొని వెళ్ళుచున్నారో, ఆ ప్రభువు దూత శిబిరములో నుండి లేచి మరియు వెళ్ళి, వారికి అపాయమునకు మధ్యలో నిలబడి యుండెను.హల్లెలూయ! ఆయన ఇంకనూ దానిని చేయును. ఆయన దారిని కలుగజేయును. ఓ, నేను కేవలం దానికొరకు ఆయనను ప్రేమిస్తున్నాను, మీరు ప్రేమించరా? సరిగా ఇప్పుడే ఇక్కడ కూర్చుని ఉన్న ప్రతి వ్యాధిగ్రస్తునికి ఆయన మార్గమును ఏర్పరచెను. ఆయన ఇదివరకే మార్గమును ఏర్పరచెను, మరియు ఆయన నీకును మరియు కష్టమునకు మధ్యలో నిలబడియుండెను.51ఆయన సరిగా ఇప్పుడు ఇక్కడే ఉన్నాడని నేను ఎరుగుదును. ఒకవేళ నన్ను ఒక మూఢ భక్తిపరుడు అని నీవు పిలవాలనుకొంటే అలాగే పిలువు; నీవు పలుకు మాటకు నేను బాధ్యుడను కాను. అయితే దేవుని ఎదుట, నేను ఏమి చెప్పానో నేను దానికి బాధ్యుడను అవుతాను. ఈ రాత్రి నీవు చూచిన ఆ వెలుగు మీదను, లేక ఆ చిత్రము మీద చూచినది, సరిగా నేను దానికి తీర్పు తీర్చినట్లయిన యెడల, అయితే ఇశ్రాయేలీయులు పిల్లలను నడిపించినది ఆయనే. వారు ఈ రాత్రి వాటిని బయట పెట్టారని నేను అనుకుంటున్నాను. ఆ రోజున యేసు ఏది చేశాడో సరిగా ఇప్పుడు ఈ భవనములో ఆ దేవుని దూతయే ఖచ్చితముగా అలాగే చేయును. అది నిర్ధారణ చేయుటకు ఆయన ఇక్కడే ఉన్నాడు. కేవలం అప్పుడు ఆయన ఏమి చేసాడో, ఇప్పుడూ ఆయన అలాగే ఉన్నాడు, మరియు ఎల్లప్పుడూ అదే విధముగా ఉండును. ఆ దేవుని దూత, మనకు మరియు వ్యాధికి మధ్యగా నిలబడుటకు మనకు మరియు మరణమునకు మధ్యలో నిలడుటకు కదలుచుండెను.దావీదు ఇలా చెప్పుటలో ఆశ్చర్యములేదు, “గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను: నీవు నాకు తోడై యుందువు.” నిశ్చయముగా.52అక్కడ నిలబడి, ఆ దేవుని యొక్క దూత ఇశ్రాయేలీయుల సమూహమును విడచి, కదలి, వారికిని మరియు శత్రువునకు మధ్యలో నిలబడెను.ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికిని, శత్రువునకు మధ్య దేవుని దూత నిలబడి ఉన్నాడు, నేను మాట్లాడుచున్నదేదో నేను ఎరిగియున్నాను. ఇప్పుడు ఇక్కడ వేదిక యొద్ద నిలబడి ఉండగా నేను ఎరుగుదును. ఈ రాత్రి ఈ చిన్న గుంపు ప్రజల ఎదుట నిలబడి మహిమ నుండి వచ్చుచూ దేవుడు చాలా హుందాగా, ఉదారముగా ఉన్నాడనియు ఈ భవనములో ఇప్పుడు నిలబడి ఉన్నాడని నాకు తెలియును. ఒకవేళ నీకు దేవుని యొక్క వాక్యముపైన కదిలి వెళ్ళే ధైర్యము ఉన్నట్లయితే, ఆయన నీ ముందు కదులునో లేదో చూడుము. గమనించుము.అది ఐగుప్తీయులకు మరియు ఆ శిబిరము మధ్యకు వచ్చినది. ఆయన నీకును మరియు నీ వ్యాధికిని మధ్యలోనికి వచ్చుచున్నాడు. ఆయన సరిగా ఇప్పుడే నీకును మరియు నీ పాపమునకూ మధ్యలో వచ్చి నిలబడియున్నాడు. ఎందుచేత? మనము సంఘము యొక్క నిర్గమములో ఉన్నాము. ఐగుప్తు ఎల్లప్పుడూ కూడా లోకముగా పిలువబడుతుంది, అంతలో ఇశ్రాయేలీయులు బయటకు రాగానే…. జ్ఞాపకము ఉంచుకొనుము, వారు అక్కడ సంఘ సభ్యులుగా ఉండిరి, అయితే రక్తము మరియు ప్రాయశ్చితార్థ బలి వచ్చిన తరువాత, వారు దేవుని యొక్క సున్నతి గలిగిన వారుగా అయ్యారు.ఈ రోజు, ఆ సున్నతి, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము అయి యున్నది. “అందరు,” “మీరందరు మీ హృదయములలో చెవులలో సున్నతి పొందని వారలారా ఎందుచేత మీరు ఎల్లప్పుడూ పరిశద్దాత్మను ఎదిరించుచున్నారు? మీ పితరులు చేసినట్టే, మీరును చేయుచున్నారు,” అని స్తెఫను చెప్పెను. పరిశుద్ధాత్మ హృదయాన్ని సున్నతి చేయును, లోక విషయాలను నరికివేయును. అది పాత-కాలపు పరిశుద్ధత కలిగిన సంఘముగా జీవించెను, దానివలె ప్రవర్తించెను, దానివలె జీవించెను. అయితే, ఈ రోజున కేవలం అది లోకములో మిగిలిన వారివలె ఉన్నది. అది ఒక అవమానకరము. మనము అడ్డు గడియలను దించాము.53వృద్దుడైన స్పర్జన్ సోదరుడు ఇలా చెప్పేవాడు, పురాతన మెథడిస్టు బోధకుడు, నా యొక్క స్నేహితుడు, ఒక పాట పాడెడువాడు.మనం అడ్డు గడియలు దించాము, మనం అడ్డు గడియలు దించాము,మనము పాపముతో రాజీపడ్డాము.మనము అడ్డు గడియలు దించాము,ఆ గొర్రెలు బయటకు వచ్చేశాయి.ఏ విధముగా మేకలు లోపలకు వచ్చును?ఎందుచేత అనగా నీవు ఆ గడియ దించావు! అంతే. నీవు క్రైస్తవ జీవితము యొక్క ప్రమాణమును క్రింద పడేసావు, ఎందుకనగా సెమినరీలు కొంతమంది బోధకుల మీద పొదిగి మరియు వారిని సత్యము విషయములో రాజీపడుటకై పంపెను. కానీ ఆ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ అక్కడే ఉన్నాడు. మరియు పాపమును గద్దించుటకు మరియు ఈ రాత్రి విశ్వాసికి మరియు లోక కార్యములకు మధ్యలో నిలబడి ఉండెను. ఆమేన్.“అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయులసేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, అయితే రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు.”చూడుము, ఈ విశ్వాసుల గుంపుకు అదే కార్యము ఇవ్వబడి యుండెను – వెలుగు – వారికి గ్రుడ్డితనము కలుగజేయుచున్నది.54మంచిది, మీ షాక్-ప్రూఫ్ జాకెట్లను (నడుము నుండి మెడవరకు రక్షణకై ఉపయోగించునవి) ధరించుడి. అది ఇక్కడకు వచ్చును. చూడండి, అలా వెలుగును తిరస్కరించు ప్రతి మనిషి అంధత్వము కలిగి చీకటిలో నడచెదరు, ఎందుకనగా నీవు వెలుగును అంగీకరించలేదు. ఆమేన్. దేవుడు సువార్తను బోధించుటకు సేవకులను పంపును. అది సత్యముగా ఉండునట్లు రుజువు చేయుటకు, ఆయన మనుష్యుల మధ్యకు అద్భుతములు మరియు సూచక క్రియలు పంపును; మరియు మనుష్యులు దానిని తిరస్కరిస్తారు, ఇక నీకు చీకటి తప్ప అక్కడ ఏమియు లేదు. నా సహోదరుడా, వెలుగు ప్రకాశించుచుండగా, వెలుగులో నడువుము. వెలుగును స్వీకరించుము. క్రీస్తే ఆ వెలుగు అయి ఉన్నాడు. ఆయన నీకు వెలుగిచ్చుటకై వచ్చి ఉన్నాడు. అయితే ఎవరు వెలుగును తిరస్కరించారో వారు చీకటిని పొందారు. ఈ రాత్రి వెలుగును తిరస్కరించే ప్రతి పురుషుడు మరియు స్త్రీ, తాను ఎటు వెళ్ళుచున్నాడో ఎరుగక, చీకటిలో నడుచుచున్నారు. అతడు ప్రజల మధ్య పేరుగలవాడై, చాలా బాగా తడబడుచూ వెంబడి

వెళ్ళుచున్నాడు, అయితే అతడు దేవుని సన్నిధిలో ఏలాగు నిలబడునో ఆశ్చర్యముగా ఉన్నది.55దానిని గమనించుము! ఇక్కడ ఎంతటి ఒక మరపురాని కార్యము ఉన్నది. ఆయన ఒకరికి వెలుగై యుండెను, మరియు మరొకరికి చీకటి అయి యుండెను. అప్పుడు, మోషే ప్రార్థన చేసిన తరువాత, ఇశ్రాయేలీయులు వారు సమాధానము పొందియుండెను. ఇప్పుడు గమనించండి.మరియు మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా, యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలిచేత సముద్రమును తొలగించి, దానిని ఆరిన నేలగా చేసెను.నీళ్ళు విభజించబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడచిపోయిరి….నీవు గమనించినయెడల, చీకటిలో నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయుల పిల్లలు మరియు వెలుగును అంగీకరించినప్పుడు, వారు ఇబ్బందులలో చిక్కినప్పుడు, ఆ వెలుగు చుట్టూ తిరుగుచూ వెనుకకు వచ్చెను. అంతలో వారు రాత్రి అంతయూ నిద్రించారు. వారు నిద్రించుచుండగా, గాలిని పంపించి, సముద్రమును తొలగించి, తప్పించుకొను ఒక మార్గమును తెరిచెను.56గొర్రెపిల్లకు హల్లెలూయ! ఈ రాత్రి, నేను పరిశుద్ధాత్మతో నింపబడినందుకు నేను ఎంతో సంతోషముగా ఉన్నాను. మనము నిద్రించుచుండగా, సంతోషించుచూ, దేవుని వాగ్దానమునందు విశ్రమించుచున్నాము.తప్పించుకొను మార్గమును దయచేస్తానని దేవుడు వారికి వాగ్దానము చేసెను. వారు ఆ వాగ్దానమునందు విశ్రమించుచుండగా, దేవుడు అక్కడ వారికి ముందు యుండి, ఒక మార్గమును తెరిచెను.ఈ రాత్రి, ప్రతి పురుషుడు మరియు స్త్రీ పరిశుద్ధాత్మను ఆధారము చేసుకొని యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే, నీవు నిద్రించుచుండగా, నీవు ఆయన వాగ్దానముపై విశ్రాంతి పొందుచుండగా, నీవు కుంటివాడవు అయి ఉండవచ్చును; నీవు గ్రుడ్డివాడవు అయి ఉండవచ్చును; నీవు వినలేనివాడవై ఉండవచ్చును; నీవు చూడలేనివాడవై ఉండవచ్చును; నీవు రోగివై ఉండవచ్చును; గుండె సమస్య, క్యాన్సర్, లేక ఏదో దానితో, చనిపోవుచు ఉండవచ్చును. ఈ రాత్రే, వెలుగును అంగీకరించి, మరియు దానిమీద విశ్రమించుము.మరియు పెంతెకోస్తు దినమున వీచిన బలమైన గాలి, ఇక్కడ దిగి సంచారము చేసి, హల్లెలూయ! నీవు రోగము అనే లోయగుండా దాటి, ఆరోగ్యకరమైన దేశములో మరలా తిరిగి ప్రవేశించునట్లు చేయుటకు వచ్చుచున్నది. నీవు చల్లారిన నామకార్ధమైన, సంకెళ్ళతో – బంధింపబడిన, ఉదాసీనమై విశ్వాసాలు రాజీపడే మత విశ్వాసాలు అనే దేశములో నుండి దాటి, నేరుగా పరిశుద్ధాత్మచే నింపబడిన, సంతోషకరమైన, ఆనందకరమైన, ఉల్లాసముతో నింపబడిన హృదయము వైపుకు వెళ్ళెదవు.57దేవుడు ఆయన శక్తిని చూపును మరియు దానిని చూపించుచుండెను. నన్ను క్షమించండి, నేను చాలా గట్టిగా చెప్పుచున్నాను. శక్తి చేత విమోచనను చూపించుచున్నాడు. ఆయన తిరిగి అక్కడ ఒక దానిపై, రక్తమును చూపించెను. ఆయన విమోచించుట ద్వారా, ఇక్కడ తన రక్తము యొక్క శక్తిని కనపరచెను, రక్తము ద్వారా మరణమును తప్పించుకొనుటకు ఆయన తన శక్తిని కనపరచెను. విమోచన శక్తి ద్వారా తప్పించుకొను మార్గమును ఏర్పరచుటకు ఆయన తన శక్తిని అగుపరచెను.మరియు ఈ రోజు అంగీకరించిన నీవు ఆమేన్, నీ పాపముల నుండి నిన్ను శుద్ధిచేయుటకు యేసుక్రీస్తు యొక్క రక్తమును స్వీకరించిన నిన్ను, పరిశుద్ధాత్మ బాప్తిస్మములోనికి నిన్ను నడిపించుటకు, పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ ఉన్నది. రోగము నుండి ఆరోగ్యములోనికి మార్చగల దేవుని శక్తి ఇక్కడ ఉన్నది. దేవుడు తన సంఘము యొక్క నిర్గమములో ఉండి కదులుచున్నాడు. దేవుడు కొద్ది దినములలో తన పంటను సమకూర్చనైయుండగా, ఆమె వికసించుచున్నది. అద్భుతం, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చుట! దానిని మనమెంతగా ప్రేమిస్తామో! నేనేమి చేయుదునో! ఈ రాత్రి, నా ప్రాణమునకు అది ఏమి కలిగించును!58స్నేహితులారా, నేను బయట ఉండగా నన్ను కలిసిన ఒక వ్యక్తితో మాట్లాడుచుంటిని మరియు ఆయన ఇలా అన్నాడు, “నేను ప్రజలతో చెప్పుటకు ప్రయత్నించుచూ ఉన్నాను.” బిల్లీ, నీవు చిన్నవాడిగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు నేను చాలా మారిపోయాను. అన్నాడు, “నీవు తరుచుగా వచ్చి, నా యొక్క వ్యాపార స్థలము యొద్దకు వచ్చి చెప్పేవాడిని అదేమంటే నేను దేవునితో సరిచేసుకోవలసి యున్నదని, నేను దేవుని దగ్గర సరిచేసుకోవలసియున్నది. నేను నిన్ను చూసి ఒక రకంగా నవ్వేవాడిని.” “కాని బిల్లీ, పరిస్థితులు ఇప్పుడు చాలా మారాయి,” అన్నాడు. “నీవు ఏమి మాట్లాడావో ఇప్పుడు నేను గ్రహించియున్నాను,” అన్నాడు. నేను “దేవునికి స్తోత్రం!” అని తలంచాను.అతడు అన్నాడు, “నేను దానిని గూర్చి ఇతరులకు చెప్పుటకు ప్రయత్నించెదను,” అంతలో అనెను, “వారు ఆ అంశమును మార్చి మరియు నవ్వు పుట్టించు ఒక పత్రిక లేక ఏదో దానిగూర్చి మాట్లాడుచుందురు. ఓ, అది నేను కాదు. ఆ మూలలో ఉన్న ఈ తరువాత వ్యక్తి, అతడు చనిపోవచ్చును. అతడు ఆ తరువాత వ్యక్తి అయి ఉన్నాడు. తరువాత వచ్చు సంఖ్య ఎవరిదో ఎరుగకయే, ఆ తరువాత వచ్చు ఆ ఒక సంఖ్య అతని సంఖ్యయే అయి ఉండవచ్చును.” స్నేహితుడా, ఈ రాత్రి అది నీది కావచ్చును. దేవుడు నిన్ను పిలుచు సమయము ఇదే కావచ్చును.59ఈ రాత్రి ఇక్కడ గొప్ప పరిశుద్ధాత్ముడైన, దేవుడు, మరణమునకు, జీవమునకు మధ్యలో, ఈ రాత్రి ఇక్కడ నిలబడియున్నాడు; వ్యాధికి మరియు ఆరోగ్యమునకు మధ్యలో ఈ రాత్రి ఇక్కడ నిలబడియున్నాడు. నేను ఏమి మాట్లాడుచున్నానో ఎరుగుదును. అది నిజము. సరిగా ఇప్పుడే, నీవు అనుభవించే అదే పరిశుద్ధాత్మచే తిరిగి-జన్మించిన ప్రతి వ్యక్తి ఈ గదిలో అదే ఆత్మను అనుభవించుటకు బద్దుడు. నీవు దానికి సహయము చేయలేవు. నీవు ఏ జీవమునైనా పొందిన యెడల, అది అక్కడ ఉన్నదని నీకు తెలియును. మంచిది.60అప్పుడు అది… ఒక అయస్కాంతము వలె ఉన్నది. ఒక గొప్ప అయస్కాంతము ఆ వస్తువుల దగ్గరకు వచ్చుచుండగా, అది కదలి మరియు ప్రాకులకు ప్రారంభించును. ఎందుచేత? అది దగ్గరకు చేరునప్పుడు…. ఒకసారి ఇండియానాలోని హమ్మండ్ వద్ద, ఇక్కడ ఎగువన ఒక పెద్ద అయస్కాంతము క్రిందకు దిగివచ్చునట్లుగా ఉన్నది. నేను గమనించుచుండగా ఇనుప ముక్కలు, నేలమీద ఉన్నవి పైకి తీసికొని రాబడెను. వారు పెద్దదైన ఒక గొప్ప మీటను లాగారు; ఒక గొప్ప అయస్కాంతము క్రిందకు వచ్చింది. అంతలో వారు నేలమధ్యలో ఉన్న ఆ ఇనుప ముక్కలు పైకి తిసుకొనబడినవి. మరియు అది వెళ్ళుచుండగా, ఆ అయస్కాంతమునకు ఆకర్షించబడి ఉండిన ఆ సమస్త లోహపు ముక్కలు ఇనుము, సరిగా పైకి వెళ్ళెను మరియు అయస్కాంతముతో, బయటకు వచ్చెను. అంతలో వారు దానిని అయస్కాంత శక్తి లేకుండా చేసి మరియు దానిని గుమ్మటములోనికి జారవేశారు. మరియు దానిని మరలా మలచెను. అక్కడ అనేకమైన ఆకర్షించబడని అల్యూమినియం లోహపు ముక్కలు విడచిపెట్టబడెను. నేను అన్నాను, “అవి ఎందుకు వెళ్ళలేదు?”అతడు అనెను, “అవి అయస్కాంతమునకు ఆకర్పించబడలేదు.”“దేవునికి స్తోత్రము. ఎందుచేత ఇవి, ఇక్కడ ఈ ఇనుప ముక్కలు అవి ఎందుకు వెళ్ళలేదు,” అని నేను అన్నాను.అన్నాడు, “నీవు గమనించినయెడల, అవి బోల్టుతో బిగించబడియుండెను.స్నేహితులారా, ఈ రాత్రి చాలామంది ప్రజలు అలాగే ఉన్నారు. నీవు ఒక సంఘ సభ్యునిగా మారావు, అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మము చేత అయస్కాంతీ కరణము చేయబడలేదు. అప్పుడు నీవు క్రింద పడునట్లుగా ఏదో రకమైన సంకెళ్ళకు అనుమతించితివి, ఏదో వ్యత్యాసమైనది నీవు క్రిందపడినట్లు సంకెళ్ళు వేసెను.61అయితే ఈ దినములలో ఒక రోజున, అలా ఈ స్థలమును తుడిచివేయగలగిన, దేవుని కుమారునిగా పిలువబడిన ఒక గొప్ప అయస్కాంతము అక్కడ తూర్పు నుండి వచ్చుచున్నది. క్రీస్తునందు మృతుడైన ప్రతి వ్యక్తియు సుదూరానికి వెళ్ళుటకు, ఆయనతో పాటు పైకి లేచుదురు. ఈ పాతవైన దేహములు రూపాంతరము చెందును, అంతలో ఆయన సొంత మహిమగల శరీరమునకు, ఆయన పోలికలో చేయబడి, అనారోగ్యము నుండి విడుదల పొందుటకు, వృద్దాప్యము నుండి విముక్తి పొందుటకును, ఇతరమైన ప్రతి దాని నుండియు విడుదల పొందుట, అక్కడే మనము శాశ్వతముగా జీవించగలము. మరియు దేవుని మహిమలో, ఎన్నటికీ ఆశీర్వదించబడిన ఆయన సన్నిధిలో జీవించుటకు అలా స్వేచ్ఛ కలిగి ఉందుము. ఆమేన్. అది నిన్ను భయపెట్ట నియ్యకుము. ఇప్పుడు నేను సరిగా భక్తి పారవశ్యముతో నిండి యున్నాను. నేను నిశ్చయముగా అలాగే ఉన్నాను. మంచిది.“అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును; ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను; నామట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు, నేనే కన్నులార ఆయనను చూచెదను.”నేను పిచ్చివానినని తలంచవద్దు. నేను అలాంటివాడను కాను. నేను అలాగున్న యెడల, కేవలం నన్ను అలాగే ఉండనివ్వండి. నేను మరొక విధముగా ఉన్నదాని కంటే, ఈ విధముగానే నేను ఎక్కువగా సంతోషముగా ఉన్నాను. అవునండి. కేవలం ఈ పద్దతిలోనే నన్ను నిలబడనివ్వండి. ఓ, నిశ్చయముగా లోకమునకు, “వెర్రివాడనే, ఎందుకనగా, లోకము వేటిని వెర్రిగా పిలుచునో, దేవుడు ఆ సంగతులను దీవించబడిన వాటిగా పిలుచును. ఈ లోకమునకు నీవు నీ మతిని పోగొట్టుకొనవలసి ఉంటుంది,” ఎందుకు? నీవు ఈ లోకానికి చెందినవాడవు కాదు.62ఆ వేరుపరచు గీతను నీవు దాటినప్పుడు, మీరు దేవుని రాజ్యపు సహ పౌరులు అవుతారు. ఓ, మై! అది ఎంతమంచిగా ఉన్నది? ఎందుకనగా, నీవు ఒక నూతన సృష్టిగా మారావు, (ఓ, మై!) ఇప్పుడు నీవుండిన స్థితిలో నుండి ఒక నూతన సృష్టిగా మారావు. “మీరు ఇప్పుడు దేవుని కుమారులు అయి యున్నారు. ఇప్పుడు మనము పరలోక స్థలములలో కూర్చుండపెట్టబడి యున్నాము. వెయ్యేండ్లు పరిపాలనలో, మనము ఉంటాము,” అని కాదు. ఇప్పుడే మనము, సరిగా ఇప్పుడే మనము దేవుని కుమారులు అయి యున్నాము. “ఇప్పుడే సరిగా, క్రీస్తుయేసు నందు, మనము పరలోక స్థలములలో కూర్చుండపెట్టబడి ఉన్నాము,” కేవలము సంఘములో కాదు, “మనము క్రీస్తు యేసునందున్నాము.”పునరుత్థానుడైన ప్రభువైన యేసు ఇక్కడే ఉన్నాడు. ఆయన శక్తిలో ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన యొక్క విమోచన శక్తిలో ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన నిర్గమము కొరకు ఇక్కడే ఉన్నాడు. ఆయనతో సహవాసము చేయుటకు ప్రతి సంఘ సభ్యుని తీసికొని వచ్చుటకు ఆయన ఇక్కడే ఉన్నాడు, నీవు ఎంతగా కిందకు దిగజారిన స్థితిలో ఉన్నను లెక్క లేదు, ప్రతి పాపిని తీసికొని వచ్చుటకు ఆయన ఇక్కడే ఉన్నాడు, నీ జీవితములోనికి ఆయన పునరుత్థానపు శక్తిని తీసికొని వచ్చి మరియు నిన్ను ఒక నూతన సృష్టిగా చేయుటకు ఆయన ఇక్కడే ఉన్నాడు.63ఇక్కడే, కొద్ది కాలము క్రితము, లండన్, ఇంగ్లాండు, లేక ఏదో చోట అని నేను నమ్ముచున్నాను, లోకములోని సకలమతములు కూడుకొనెను. ఖచ్చితముగా నాకది జ్ఞాపకములేదు. అయితే, వారు పలు విధములైన సంఘములు, మహ్మదీయులు, మరియు బౌద్ధులు, మరియు ప్రతిదానిని గూర్చియు మాట్లాడుతున్నారు. ఒక చిన్నవాడైన… అమెరికన్ హోలీనెస్ సంఘానికి ప్రాతినిధ్యం వహించు ఒక వ్యక్తి, అతని యొక్క పేరు, జాన్ విట్, అని నేను నమ్ముచున్నాను. ఈ గొప్ప కూటములో సకలమతములు ప్రాతినిధ్యము వహించెను, కనుక అతడు మాట్లాడుటకు అతని సమయము వచ్చునప్పుడు, అతడు పైకి లేచి, అతడు లేడి మక్కాబీ కథను గూర్చి మాట్లాడెను, ఆమె ఎంతగా దిగజారి ఉండెనో, ఆమె నోటిలో సిగిరెట్టుతో, నడుపుచుండగా… ఆ వీధుల గుండా ఒక స్టేజికోచ్ (నడిపే మోటారు వాహనము) చట్టము యొక్క వేగపరిమితిని అతి క్రమించగా ఓక్లహామాలో అరెస్టు చేశారు. ఆమె ఎన్నో హత్యలు చేసెను మరియు ఎంతో మురికిగా మరియు ఎంతో కఠినమైనది, ఎంతవరకనగా వారు శరీరమంతా తారుతో పులిమి, తరువాత ఆమెను ఈకలతో నింపి శిక్షించుటకు వెళ్ళగా, వారు ఆమెపై వారి చేతులు కూడా ఉంచలేక పోయారు, వారు కలుషితమయ్యేదరని భయపడ్డారు.అంతలో అతడు ఒక విధమైన నాటకీయ పద్దతిలో ఆ కథను చెప్పగా, వినుచున్న ప్రతీ వ్యక్తి తమ సీట్లు అంచునకు ముందుకు వంగి వినుచుండెను. అతడు అనెను, “అయ్యలారా, లేడీ మక్కాబీ చేతులను కడిగివేయునది ఈ లోక మతాలలో, నీవు కలిగి ఉన్న నీ మతము అయినా కలిగి ఉండెనా?” ఎవరూ ఒక్క మాటయు చెప్పలేదు. అతడు గాలిలోనికి గెంతి అతని పాదాలను కలిపి తన్నెను మరియు అతని చేతులు చరచి అతడు అన్నాడు, “యేసుక్రీస్తు రక్తము ఆమె చేతులు కడుగుటయే కాదు, గాని ఆమె హృదయమును అది కడుగగలదు.” ఆమేన్. అది నిజము.64యేసుక్రీస్తు రక్తము కెంటకీలో, లూయీస్ విల్ లో ఒక నీచమైన వేశ్యను తీసికొని మరియు ఆమెను ఒక పరిశుద్ధురాలయిన, స్త్రీగా చేయును. అది సుదూరాన ఉన్న స్థలములో నుండి ఒక నాటు సారా కాయువాని తీసికొని మరియు అతనిలో నుండి ఒక గౌరవముతో కూడిన పెద్ద మనిషిగా మరియు దేవుని యొక్క పరిశుద్ధుని చేయును.నా స్నేహితులారా, రాజ్యము యొక్క పౌరులుగా, కెంటకీ మరియు ఇండియానా, మరియు ఆ చుట్టూ ఉన్న నా సహచరులైన సేవకులారా! ఈ రాత్రి, మీరు ఆలోచించారా, మీ చివరి అవకాశము తీసివేయుటకు ముందు, ఈ ప్రభువైన యేసును గూర్చి లక్ష్యము చేయుటకు మీ కొరకు ఇది సమయము అయి ఉన్నది.65ఈ గొప్ప నిర్గమములో సంఘము వెళ్ళుట మీరు చూచినప్పుడు, మన ముందు నిలువబడి, ఆశ్చర్య కార్యములను మరియు సూచక క్రియలను జరిగించుచు నడిపించుచున్న ఆ అగ్నిస్తంభమును చూచినప్పుడు… ఈ రాత్రి, ఆయన సమస్త విమోచన శక్తిలో, ప్రతి పాపిని పరిశుద్దునిగా చేయుటకును, జారిపోయిన ప్రతి వానిని తిరిగి దారిలో పెట్టుటకును ఆయన ఇక్కడ ఉన్నాడు. వ్యాధిగ్రస్తుడైన ప్రతి వానిని స్వస్థపరచుటకు ఆయన ఇక్కడే ఉన్నాడు.ఆయనే సంపూర్ణ సువార్త అయి ఉన్నాడు. మేము సంపూర్ణ సువార్తను బోధిస్తున్నాము; గొర్రెపిల్లను పూర్తిగా తింటాము. పరిశుద్ధాత్మతో దానిని కాల్చెదము మరియు అది తినుటకు మంచిదని ఎరుగుదుము, ఎందుకనగా అలా అది నిజముగా మంచిదై ఉన్నదని పరిశుద్ధాత్ముడు మనకు పంచి ఇచ్చెను. “యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలిసికొనుడి. అది బండలోని తేనెవలే రుచిగా ఉన్నది.”మన ప్రభువైన యేసు, ఆయన ప్రేమ మరియు శక్తిలో, ఆయన ఘనమైన విమోచనా ఆశీర్వాదములతో ఇక్కడే ఉన్నాడు. ఓ, ఈ రాత్రి, సంఘానికి మరియు పాపానికి మధ్యలో ఆయన ఎంతగానో నిలచియుండెను. ఎలాగనగా స్రవించుచున్న రక్తముతోను, ప్రార్థించుచూ నీకును, మరియు తీర్పునకు మధ్యలో ఆయన నిలుచును.66ఇక్కడ ఈ మధ్యకాలములో, ఒహాయోలో ఇక్కడ ఒక స్థలములోనికి నేను నడచివెళ్ళాను, న్యాయతీర్పును గూర్చిన నా అభిప్రాయం కేవలం అక్కడే పొందాను. నేను ఒక చిన్న డంకార్డ్ రెస్టారెంట్ లో తినుచున్నాను. మాకు గొప్ప కూడిక జరుగుచుండెను. గ్రామానికి చాలా మైళ్ళదూరములో, ఒక చిన్న మోటల్ యొద్ద నేను ఉండవలసి యున్నది. నేను ఒక డంకార్డ్ రెస్టారెంట్లో తినుచున్నాను. చక్కగా ప్రేమించు ప్రజలు మరియు వారు ఆదివారము మూసివేసి మరియు సంఘానికి వెళ్ళారు. నేను అందరూ వెళ్ళే సామాన్యమైన చిన్న అమెరికన్ స్థలానికి భోజనం చేయుటకు నేను వెళ్ళవలసి యున్నది.నేను ద్వారము లోపలకు నడచివెళ్ళగా, నాకు ఆశ్చర్యము కలిగించిన సంగతి, అక్కడ ఒక రాష్ట్ర పోలీసు ఒక అమ్మాయి నడుముచుట్టూ చేయి పెట్టి ఒక స్లాటుమిష ఆడుచు, ఇప్పుడు ఓహియోలో జూదమనునది చట్ట వ్యతిరేకము, మరియు అక్కడ చట్టం అమలు చేయు మనిషే తనకు తానే చట్టమును అతిక్రమించుచున్నాను. బహుశా అతడు, బహుశా, నా వయసుగల ఒక మనిషి, బహుశా పెండ్లి అయిన, ఒకచోట ఎక్కడో కుటుంబము ఉండి యుండును; ఇక్కడ నిలబడి ఉన్న ఎవరో యవ్వన స్త్రీ చుట్టూ అతని చేతులు ఉంచెను.నేను రెస్టారెంట్ వెనుకకు చూశాను, అక్కడ వెనుక, త్రాగి, కొందరు బాలురు కూర్చుని ఉన్నారు, అంతలో ఒక యవ్వన స్త్రీ ఎంత మాత్రమూ నీతిగా ప్రవర్తించుటలేదు. ఒక స్థలము వద్ద క్రింద కూర్చొనుటకు నేను సిద్ధముగా ఉండి, ఇక్కడ నాకు కుడి ప్రక్కకు క్రింద కూర్చొనుచూ చూశాను.అక్కడ పెద్దదైన స్త్రీ కూర్చుని ఉన్నది, దాదాపు యాబై-ఎనిమిది, అరవై సంవత్సరముల వయస్సు, నా తల్లి అంత పెద్ద వయస్సుగలదై ఉన్నది. అక్కడ కూర్చొని ఉండెను, చర్మము అంతా ముడతలు పడి ఉన్నది, చిన్న పొట్టి బట్టలు ధరించినది. మరియు, ఓ, అది భయంకరముగా ఉండెను. ఆమె కాళ్ళు గోళ్ళకు ఎరుపు, నీలము కలసిన రంగు వేయబడెను, ఆమె పెదవులకు ఎరుపు, నీలం రంగు వేయబడి, నీవు ఎన్నడైననూ చూడనంత అతి భయంకరముగా కనిపించు దృశ్యముగా ఉన్నది. ఆమె తలవెంట్రుకలు ఎంతో పొట్టిగా కత్తిరించుకొని మరియు ఆ విధముగా నుదుటిపై జుట్టు వ్రేలాడుచున్నది. మరియు ఆమె త్రాగుచుండెను.అక్కడ ఆమెతో ఇద్దరు మనుష్యులు, త్రాగినవారై భయంకరముగా కనబడుచు అక్కడ కూర్చున్నారు, మరియు వారిలో ఒకరు బల్ల మీద అడ్డంగా పడి ఉన్నాడు. అంతలో వారికి వారే తప్పుకొని, మరియు విశ్రాంతి గదిలోనికి వెళ్ళారు…67నేను అక్కడే నిలబడ్డాను. నేను తలంచాను, “ఓ దేవా, దానిని నీవెలా సహించగలుగుచున్నావు? అలా ఉన్న ఆ విధమైన దానివైపు ఏలాగు చూడగలుగుచున్నావు? అదే సమయములో నా హృదయములో, నేను అప్పటి వరకు ఎంత చెడ్డవాడుగా ఉన్నానో నేను అంత హీనమైనవానిగా ఉన్నాను. ఇంత అయినా, నా చిన్న శారా రిబ్కాలు రాబోవుచున్న దానిని చూచుటకు అటువంటి తరములో పెంచవలెనా, అని నేను ఆశ్చర్యపడుచున్నాను. ప్రభువా, భూమిపై నుండి నీవు దానిని ఎందుకు తుడిచిపెట్టవు?” నేను అనుకున్నాను, “ప్రభువా, కేవలం దానిని నీవు ఎందుకు చేయుటలేదు?”నేను అక్కడే కూర్చుని అంతలో ఏడ్చుట ప్రారంభించాను. నేను ఒక దర్శనము చూశాను. నేను చూడగా, అది ఇలా ఉండెను, ప్రపంచము గాలిలో చుట్టు సుడి తిరుగుచుండెను మరియు అక్కడ ఆ ప్రపంచము చుట్టూ ఒక వర్షధనస్సు నిలిచి ఉండెను. అంతలో ఎవరో నాతో మాట్లాడుచూ, చెప్పెను, “ఈ ప్రపంచము చుట్టూ ఉన్నది యేసుక్రీస్తు రక్తమైయున్నది, అది ఈ లోకమును నాశనము చేయకుండునట్లు ఆయనను ఆపివేస్తున్నది. దేవుడు పాపమును చూసినయెడల, ‘నీవు దానిని తిను దినమున, ఆ దినముననే నీవు చనిపోవుదువు.’ అక్కడ ఆ రక్తము క్రింద ఉన్న ప్రతి మనిషికి, ఒకటి ఉన్నది. నీవు ఎన్నిక చేసికొనుటకు, ఒక స్వేచ్ఛా జీవి అయి ఉన్నావు. అయితే నీవు చనిపోయినయెడల, నీ ఆత్మ ఆ రక్తము యొక్క కనికరమునకు పైగా ప్రయాణించును, నీవు అక్కడకు చేరకముందే నీవు ఇదివరకే తీర్పు తీర్చబడియున్నావు. నీ కొరకు అక్కడ ఏమియు విడచిపెట్టబడలేదు.”68అప్పుడు స్వయముగా నన్ను నేను చూచుకున్నాను. ఆయన తలపై ముండ్ల కిరీటముతో, నా ప్రభువైన యేసు అక్కడ నిలబడి ఉండుట చూశాను, మరియు రక్తముతో కలసిన, కన్నీళ్ళు క్రింద పడుచుండగా, అది ఆయన గెడ్డమును కడిగెను. నా పాపములు ఆయనకు ఎదుట వచ్చుట నేను చూశాను, మరియు ప్రతిసారి అవి అలా ఆయన ఎదుటకు వచ్చినప్పుడు… [టేపుపై ఖాళీ ఉన్నది.]… ఆయనను వణకింపచేసి ఉండెను. ముండ్లు మరి ఎక్కువగా, ఆయన నుదురుపై అతుకొన్నవి. ఆయన వెనుకకు తూలి ఉన్నాడు. ఆయన ఇలా చెప్పి ఉండును, “తండ్రి, అతడు ఏమి చేయుచున్నాడో అతనికి తెలియదు, అతనిని క్షమించుము.” అంతలో నేను మరల ఏదో చేసి ఉన్నాను, మరియు అప్పుడు ఆయన రక్తము కారు మీద ఉండు బంపరువలె ఉండి, ఆ కారును రక్షించునట్లు, అనర్హుడనైన నన్ను దేవుని ఉగ్రత నుండి రక్షించుచుండెను.నెమ్మదిగా, ఆయన దగ్గరకు వచ్చి, ఆయన యొద్ద మోకాళ్ళూనాను. పాపముల జాబితా గల ఒక పురాతన గ్రంథము నా యెదుట అక్కడ క్రింద పడవేయబడియుండుట చూసాను, మరియు నా యొక్క పేరు దాని పై భాగములో అడ్డముగా రాయబడి ఉండెను. అప్పుడు నేనన్నాను, “ప్రభువా, నీవు నన్ను క్షమించగలవా?”“నిశ్చయముగా,” అని దయగల కన్నులతో, ఆయన చెప్పెను; ఆయన ప్రక్క చెయ్యితో, కొంత రక్తము బయటకు తీసి, మరియు “క్షమించబడెను,” అని దానిపై వ్రాసెను. అంతలో దానిని మరలమరుపు అను సముద్రములో విసిరెను. ఆయన అనెను, “ఇప్పుడు…” నేను అన్నాను, “ప్రభువా, నీకు వందనములు.”ఆయన అనెను, “ఇప్పుడు, నేను నిన్ను క్షమించాను; మరియు నీవు ఆమెను గద్దించుచున్నావు.” ఓ, అది చిత్రమునే మార్చివేసినది, నా కొరకు.69నేను దానిలో నుండి బయటకు వచ్చాను. నేను అక్కడకు నడచి వెళ్ళాను మరియు ఆమె దగ్గరకు వెళ్ళి క్రింద కూర్చుని, మాట్లాడుటకు మొదలు పెట్టాను. ఆమె అంతకు ముందుగా వెనుక కొంత కఠినమైన జీవితము కలిగి యుండెను. నేను “నీవు ఎన్నడైనా ఒక క్రైస్తవురాలుగా ఉంటివా?” అని అన్నాను.“నేను ఒక క్రైస్తవ గృహములో పెంచబడితిని,” అని ఆమె అన్నది.“ఏమి జరిగినది?” అన్నాను.ఆమె తన భర్తతో పోగొట్టుకున్న సఖ్యత లేక ఎడబాటును గూర్చి, పిల్లలు ఏమి చేసారో మొదలైన విషయములు నాతో చెప్పినది. ఇన్ని సంవత్సరములు, నీవు దేవునిని కలుసుకున్నప్పటి నుండి నీవెన్నడూ సమాధానకరముగా జీవించలేదా?“ అన్నాను.ఆమె అన్నది, “అయ్యా, అది సత్యమైయున్నది.”నేను అన్నాను, “ఇప్పుడే ఆయనను స్వీకరించవా.”ఆమె అన్నది, “ఆయన నన్ను తీసికొనునా?”నేను అన్నాను, “ఇప్పుడే ఆయన నీ హృదయము నొద్ద తట్టుచున్నాడు.”అంతలో ఆ దుకాణము బయట, అక్కడే నేలమీద, ఆ ప్రేక్షకులయిన ప్రజలముందు క్రింద మోకాళ్ళునాము; స్లాట్ మిషనులు ఆగిపోయినవి, దుర్భాషలతో శపించుట మరియు తదితరమైనవి ఆగిపోయినవి. అంతలో నా చేతులు పైకెత్తాను, మరియు ముడతలు పడిన ఆ దీనమైన చేతులు పైకెత్తెను, మరియు ఆమెను యేసుక్రీస్తు యొద్దకు నడిపించాను. ఆమె… అంతే, స్నేహితులారా. దేనివైపు చూడవద్దు… యేసే…నీవు ఏమి చేసినను నేను లక్ష్యము చేయను, నీ పాపాలు ఎంత నల్లగా ఉన్నను, నీ జీవితము ఎంత మసిగా ఉన్నను; దేవుడు నిలబడి, ఈ రాత్రి, నీవు ఎవరైయున్ననూ లెక్క లేదు, నిన్ను క్షమించుటకు, నీ హృదయము అనే తలుపు యొద్ద ఉండి తట్టుచూ యున్నాడు.70ఒక్క నిమిషము మన తలలు వంచెదము, సహోదరీ, అక్కడ ఆర్గను దగ్గరకు రండి, రాగలవా?ఓ, పరలోకపు తండ్రీ, పరిశుద్ధాత్మ భవనములో కదలుచుండగా, కేవలం ఇప్పుడే నీవు అలా చేయగలవని ప్రార్థించుచున్నాను. నీ యొక్క దయను కనుగొనుటకు మేము మొదట రాజ్యమును వెదికెదము, అప్పుడు నీవు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెదవని నేను నమ్ముచున్నాను. కానీ సరిగా ఇప్పుడే, తండ్రి, అలా అక్కడ ఒక గొప్పదైన లోతైన ఆసక్తి మరియు ఒప్పుదల భావన కలిగి ఉండియు, అలా నీ సంఘము నిర్గమములో ఉన్నదని ప్రజలు ఎరిగి యున్నారు, మరియు మేము న్యాయతీర్పు వైపుగా వెళ్ళుచున్నాము. ఏమియూ ఎరుగకుండానే, అయితే ఉదయవేళలో ఎవరో పడక ప్రక్కకు రావచ్చును, అక్కడే మేము పడి ఉండి, వెళ్ళిపోయి ఉండవచ్చును. ఈ సమయములో, రేపు రాత్రికి, ఎక్కడో ఒక చోట శవాలను ఉంచు గదిలో ఉండవచ్చును, మరియు మా ఆత్మలు.ఓ దేవా, ఇదే చివరి ఘడియ కావచ్చును! ఆ మనిషి అంగీకరించు చివరి ఘడియలు ఇదే అయి యుండవచ్చును. అనేకులు, సందేహము లేదు, ఇక్కడ కూర్చున్నారు, పురుషులు మరియు స్త్రీలు, కేవలం ఒక సామాన్యమైన మంచి జీవితము జీవించు, కోరిక గలవారే, అయితే ఎన్నడూ తిరిగి జన్మించ లేదనియు, పరిశుద్ధాత్మలో నింపబడుటకు దాని ఉద్దేశ్యము ఏమిటో ఎరుగరు, సంపూర్ణముగా అప్పగించుకొను ఒక జీవితము అంటే ఏమిటో ఎరుగరు; సమస్త బంధకములు, బిడియాలు వారి నుండి తీసివేయబడి, దేవుని ఆత్మ ఆయన కనికరములోనికి బాప్తిస్మమిచ్చును గాక.ప్రియమైన, తండ్రి, ఈ రాత్రి నీవు ప్రేమించిన నీ కుమారుడైన, యేసు నామములో, ప్రతి హృదయము దగ్గరకు కదలి వెళ్ళి మరియు ఇప్పుడే వారితో నీవు మాట్లాడవా. వారి హృదయము యొక్క సామాన్యతలో, నీవైపునకు వారి ఆలోచనలు పైకెత్తి, వారి హృదయమును పైకెత్తి మరియు “యేసూ, నేను ఇక్కడే ఉన్నాను. కేవలం నేను ఉన్నరీతిగానే, ఇప్పుడే నన్ను స్వీకరించుము మరియు నన్ను మలచుము మరియు నన్ను ఏదో ప్రత్యేకమైనవానిగ చేయుము. నన్ను నీవు కలిగి ఉండునట్లుగా ఆ రకమైన మనిషిగా నన్ను తయారు చేయండి. నా జీవితకాలమంతయు, నీవు నాతో మాట్లాడియుంటివి. నీవు నాతో సంభాషించిచుంటివి. నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా చేయుటకు నన్ను పొందుటకై నీవు ప్రయత్నించితివి. అలా అప్పగించుకొనునట్లు నన్ను తయారు చేయుటకు నీవు ప్రయత్నించావు. అయితే ఇప్పటికే దినము ఎంతో గతించిపోయినది, నా ద్వారా, అయితే నేను ఇప్పుడే రావడానికి సిద్దముగా ఉన్నాను,” అని చెప్పుదురు గాక. తండ్రి, అది అనుగ్రహించండి. న్యాయతీర్పుకు ముందే; కనికరము పిలుచుచుండగా, సంఘము యొక్క నిర్గమము, ఐగుప్తును విడచి పెట్టుచున్నది; వారు వచ్చి, బయటకు పిలువబడిన ఆ గొప్ప గుంపు వెంట వెళ్ళుదురు గాక. మేము దానిని ఆయన నామములో అడుగుచున్నాము.71మనం మన తలలు వంచి యుండగా, మరియు కండ్లు మూసుకొని యుండగా, క్రైస్తవులు ప్రార్ధించుచున్నారు. “సహోదరుడా బ్రెన్హాం, నీవు నన్ను జ్ఞాపకము చేసికొనుము, నేను యేసుక్రీస్తును గూర్చి నీవు చెప్పుచున్న ప్రతిమాట సత్యమై ఉన్నదనియు నేను నమ్ముచున్నాను. మేము అందరం ఆత్మలో నింపబడవలసిన అవసరం కలదు, మరియు ఇంకా నేను అలా లేను. నేను ఒక సంఘ సభ్యునిగా ఉన్నాను,” అని నీవు చెయ్యి ఎత్తి చెప్పిన యెడల, నేను సంతోషిస్తాను. లేక, ఎంత మాత్రము నీవు అలా కాకుండా ఉండవచ్చును. ఎన్నడూ యేసుక్రీస్తును అంగీకరించక, నీవు ఒక పాపివి అయి ఉండవచ్చును. లేక, నీవు సంఘ సభ్యునిగా ఉన్నావు, మరియు తిరిగి జన్మించలేదు. నీ చెయ్యిని పైకెత్తి, ఇలా చెప్పగలవా, “సహోదరుడా బ్రెన్హాం నీ ప్రార్థనలో, నన్ను జ్ఞాపకము చేసికొనుము. నేను సరియైనవానిగా ఉండగోరుచున్నాను.”దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును, మరియు నిన్ను, మరియు నిన్ను, నిన్ను, నిన్ను మరియు నిన్ను, నా సహోదరుడా; మరియు నిన్ను, సహోదరీ; మరియు నిన్ను, సహోదరుడా; నిన్ను, నిన్ను, నిన్ను, సహోదరుడా, సహోదరీ. నేను చూస్తున్నాను.ఓ, నా ఎడమ ప్రక్క ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీ చెయ్యి పైకెత్తి, చెప్పండి, “బ్రెన్హాం సహోదరుడా, నన్ను జ్ఞాపకము చేసికొనుము, నేను తిరిగి జన్మించ గోరుచున్నాను.”72ఇప్పుడు, జ్ఞాపకముంచుకొనుము, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుచున్నాడు. నేను దేవుని సేవకుడను అయిన యెడల, ఈ వేదిక యొద్ద నేను ఎలా నిలబడి ఉన్నానో అంత నిశ్చయముగా, అలా పరిశుద్ధాత్ముడు ఇక్కడ హృదయములతో మాట్లాడుచున్నాడని నాకు తెలియును. స్నేహితులారా, నేను మీకు ప్రత్యేకమైనది చెప్పినవానిగ ఉండవచ్చును, అయితే నేను మూఢభక్తిగలవాడను కాదు. నేను మాట్లాడునది నేను ఎరుగుదును; అక్కడ బయట నీకున్న నీ కష్టము ఏమిటో నేను ఎరిగినయెడల, మరియు నీ వ్యాధి ఏమై ఉన్నదో ఎరిగినయెడల మరియు దేవుడు నీ కొరకు నా ప్రార్ధన వినును. మరియు ఇక్కడే సరిగా క్యాన్సర్ మరియు అంధత్వము, మరియు చెవిటితనము, కుంటివారు, మరియు ఇతరమైన ప్రతీదియు ఈ భవనములో కూర్చున్న ప్రజలు అలా స్వస్థపరచబడెదరు. ప్రపంచము చుట్టూ ఉన్న ఆ కూటములువైపు చూడండి. ఇప్పుడు నీ విషయము ఏమిటి? ఇప్పుడు దాని గూర్చి ఏమిటి? దాని కొరకు ఆయన నా ప్రార్థన వినినయెడల, నీ ఆత్మను గూర్చిన నీ స్థితి కొరకు ఆయన నా ప్రార్ధన వినడా? నీ కష్టము ఎక్కడ ఉన్నదో ఆయన నాకు బయలుపరచిన యెడల, ఇప్పుడు నీ కష్టము ఎక్కడ ఉన్నదో ఆయన నాకు బయలుపరచడా?ఇంకా ఎంతమంది ఇప్పుడు మీ చెయ్యి పైకెత్తి, ఇలా చెప్పగలరు, “సహోదరుడా బ్రెన్హాం నన్ను జ్ఞాపకము చేసికొనుము. నాకు దేవుడు కరుణ చూపవలెనని అడుగవలెనని, ఈ సమయములో నేను కోరుచున్నాను.” దేవుడు నిన్ను దీవించును, మరియు నిన్ను, మరియు నిన్ను, మరల. ఓ, మై, కేవలం ఈ భవనమందంతటా, ప్రతిచోట!73మీరు మీ తలలు వంచి ఉండగా. కేవలం మరియు కొంత కృప కొరకు, అలా మీరు, చెయ్యి ఎత్తగలిగిన యెడల నేను అద్భుతంగా భావిస్తాను, ఇలా చెప్పండి, “ప్రభువా, నా చెయ్యి ఎత్తుటకు చాలినంత కృప నేను కలిగి ఉన్నాను, అతడు ప్రార్థించుచుండగా నిలబడి ఉండుటకు చాలినంత కృప నాకు ఇవ్వండి. తెల్లవారక మునుపు, ఆయన నా కొరకు వచ్చినయెడల, ప్రభువా, అలా నేను సరియైనవానిగా ఉండగోరుచున్నానని, ఇది నీ కొరకు నాకు గుర్తు అయి ఉన్నది. ఏదో రోజున నేను నిన్ను కలుసుకొనగోరుచున్నాను. ఈ దగ్గు నా చొక్కా చేతులు వరకే రాగలదు, అంతలో నేను చనిపోవుచూ తలగడను బలముగా నొక్కగలను. వైద్యుడు నా పడక ప్రక్కనుండి విడచి వెళ్ళును; ఏమియు చేయలేము. అప్పుడు దేవా, నా ప్రాణముపై దయ చూపండి. గదిలో మరణము యొక్క చల్లని పొగలు తేలియాడుచుండగా, నన్ను తీసికొని వెళ్ళుటకు పురాతన సీయోను ఓడ వచ్చును గాక. ప్రభువా, నేను నిలబడబోవుచున్నాను. అది ఎంతో కృపను తీసికొనుచున్నది, అయితే ఏదో నన్ను కదలించుచున్నది. నేను నిలబడుచున్నాను.” సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక.ఎవరైనా నిలబడి చెప్పండి, “ప్రభువా, నేను నిలబడుచున్నాను.” సహోదరుడా దేవుడు నిన్ను దీవించును. సహోదరుడా, సహోదరీ, దేవుడు నిన్ను దీవించును. కేవలం అలాగే నిలచి ఉండండి. నీ ఆత్మ యొక్క రక్షణ కొరకు ఈ ప్రార్ధనలో జ్ఞాపకము ఉంచుకొనవలెనని అలా కోరు ప్రతివారు, మీరు నిలబడి ఉండండి. దేవుడు నిన్ను దీవించును. యవ్వనుడా, దేవుడు నిన్ను దీవించును. అయ్యా, దేవుడు నిన్ను దీవించును, సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. నా సహోదరీ, దేవుడు నిన్ను దీవించును; నిన్ను, సహోదరుడా.ఇప్పుడు ఇంకా ఎవరైనా నిలబడి మరియు ఇలా చెప్పండి, “నేను ఇక్కడే ఉన్నాను. బ్రెన్హాం సహోదరుడా, నేను నీ ఎదుట నిలబడి ఉండలేదు. నేను దేవుని ఎదుట నిలబడి ఉన్నాను. ఏదో నిలబడమని నాతో చెప్పెను, అంతలో నేను నిలబడి ఉన్నాను.” మీరు అలా చేస్తారా? కేవలం నీ పాదములపై నిలబడి ఉండు. కేవలం ఇలా ఎక్కువగా దేవుని తీసికొనుము. అమ్మా, దేవుడు నిన్ను దీవించును.74అక్కడ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అమ్మా, దేవుడు నిన్ను దీవించును. అది నిజము. ఆ దీనురాలైన తల్లి తన బిడ్డను పట్టుకొని, ఆమె కళ్ళలో కన్నీళ్ళతో, పైకి లేచుటకు ప్రయత్నించుచున్నది. నీవు రాలేవా? మరల లేచి నిలబడుము. అమ్మా, దేవుడు నిన్ను దీవించును, పెద్ద వయసు గల స్త్రీ అక్కడ నిలబడి ఉన్నది, మరియు నిజముగా ఆమె పెద్దది, ఈ దినములలో ఒక రోజున, ఆమె దేవుని కలుసుకోబోతుందని ఆమె ఎరిగి ఉన్నది. దేవుడు నిన్ను దీవించును. ఇప్పుడు ఆ తరువాత ఎవరో నిలబడి, “నేను నిలబడగలను” అని చెప్పుదురు?ప్రార్ధన కొరకై కేవలము అలాగే నిలబడి ఉండుము.మరొకరు ఎవరైన? కేవలం నేను అక్కడ ఎవరో మరొకరు నిలబడగోరుచున్నారని భావన కలిగి ఉన్నాను. నీవు కొంచెం దగ్గరగ రావలెనని కోరియుండవచ్చును. దానిని ఇక ఏ మాత్రము ఆర్పివేయవద్దు. కేవలం నిలబడుము. నీవు అలా చేయగలవా? అలా దేవుని దగ్గరకు రాగోరుచున్న నీవు. దేవుడు నిన్ను దీవించును. అది నిజము. ఏ వ్యక్తి అయినా ఉన్నారా… అమ్మా దేవుడు నిన్ను దీవించును. అవునండి.కనీసం అక్కడ ఇంకా ముగ్గురు ఉన్నారు, పైకి లేచి నిలబడవలసి ఉన్నారని, నేను సరిగా తిన్నగా వారి వైపే చూచుచున్నాను, “కారణం ఏమనగా అక్కడ దేవుని దూత నిలబడి ఉన్నాడు. అమ్మా, దేవుడు నిన్ను దీవించును. అది నిజము. ఇప్పుడు, సహోదరుడా, అంతా సరియైనదిగా ఉన్నది, దానిని గూర్చి ఏమిటి? అంతా సరియైనదిగా ఉన్నది. అంతలో, ప్రభువు దూత నిలబడి ఉన్నాడు, నేను ఎరుగుదును. నేను అది చూశాను మరియు ఇప్పుడు ఎవరో ఒకరు సరిగా నిలబడవలసి యున్నదని నాకు తెలియును. కేవలము నేను ఇంకా ఒక నిమిషము కనిపెట్టగలను. బహుశా దేవుడు… ఆయన నీ హృదయము నొద్ద ఒత్తిడి కలిగించుచున్నాడని నీవు ఎరుగుదువు. నా స్నేహితుడా, ఆయన అక్కడే నిలబడి యున్నాడు. నిలబడమని అలా నీతో చెప్పుచున్నది ఆయనే. నీవు అది చేయలేవా? కేవలము నిలబడి మరియు ఆయనను అంగీకరించుము. కేవలము ఇప్పుడే. మంచిది.ఇప్పుడు నీవు నిశ్చయత కలిగి ఉన్నావా? ఈ సమావేశములో, ఈ రాత్రి దేవుడు పిలచినయెడల; ఈ ప్రసంగము, ఈ ఆహ్వానము, నీవు చనిపోయినప్పుడు దూరమున నిన్ను కలుసుకొననై ఉన్నది. దానిని గూర్చి నీవు ఏమి చేసి ఉన్నావు? నీవు అనుకూలముగా లేనియెడల, ఇప్పుడే నిలబడుము, వెలుగులో నడుచుటకు, నీవు అంగీకరించగోరునట్లు అలా ఆయన చూడగలడు.75ఇప్పుడు, దయగల మా పరలోకపు తండ్రీ, వీరు నీవు ప్రేమించిన పిల్లలు, మెత్తని హృదయములు గలవారు, ఈ రాత్రి నీ వాక్యము వారి హృదయములో పడెను. “వినుటవలన విశ్వాసము కలుగును మరియు వాక్యము వినుటవలన కలుగును.” మరియు వారు వినగలిగి, ఉన్నారు. నీవు వారి హృదయములను మెత్తగా చేశావు, పురుషులు, స్త్రీలు, బాలురు మరియు బాలికలు, అనేకులు నిలబడుచు వారి ప్రియమైన సొంత రక్షకునిగా మరియు నాయకునిగా నిన్ను ఒప్పుకొనుచున్నారు.ఇప్పుడు ఈ రాత్రి ఇక్కడే ఉన్న ఆ దేవుని దూత వారిని జీవిత కాలమంతా నడిపించును గాక. వారి హృదయములలో, యేసును వారి రక్షకునిగా అంగీకరించి, కేవలం ఇప్పుడే వారు కల్వరియొద్దకు నడిపించబడుదురు గాక. ఆ పరిశుద్ధాత్ముడు, క్రీస్తు రక్తము గుండా, వారి ఆత్మల మీదకు క్రిందకు దిగివచ్చి, మరియు సమస్త వ్యత్యాసములను తొలగించి, మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో వారిని నింపును గాక. వారి జీవితములో ఇది ఘనమైన రాత్రిగా ఉండును గాక. అది అలా ఉన్నదని మాకు తెలియును, ఎందుకనగా ఈ రాత్రి వారు నిన్ను స్వీకరించారు. ప్రభువా, కేవలం ఇప్పుడే దానిని దయచేయుము. మరియు ఈ రాత్రి వారు ఇక్కడ నుండి ఆనందించుచు మరియు సంతోషించుచూ, వారు పూర్ణ హృదయముతో, దేవుని స్తుతించుచూ వారు గృహమునకు వెళ్ళెదరు గాక ఈ ఆశీర్వాదమును యేసుక్రీస్తు నామము ద్వార ప్రార్థించుచున్నాను.ఇప్పుడు మీరు కూర్చొనుచుండగా ప్రభువు మిమ్మును దీవించును గాక.76ఇప్పుడు నేను మిమ్మును అడుగనివ్వండి. అలా నిలబడిన మీలో ప్రతి ఒక్కరూ మీరు చెయ్యి ఎత్తి మీరు నిలబడి ఉండగా మీకు ఏదో జరిగినదని మీకు తెలియును. కేవలం మీ చెయ్యి పైకెత్తండి, ఏదో జరిగినదని మీకు తెలియును. దేవుడు మిమ్మును దీవించును. దేవుడు మిమ్మును దీవించును. అది నిజము. స్నేహితులారా, అది అలాగే ఉండవలసి యున్నది. అది అలాగే ఉండవలసి యున్నది. నేను నిలబడి ఇప్పుడే ఇక్కడ చూశాను, నేను మాట్లాడిన అదే దూత; ఇక్కడ ఈ భవనము గుండా వెళ్ళుట, అగ్నిస్తంభము. ప్రభువు యొక్క అదే దూత. నేను అదే ప్రేరణచే గత 5 లేక 10 నిమిషాల నుండి బోధించుచున్నాను. నేను అది అనుభవించాను, కేవలము అది ఈ భవనము గుండా కదలుచుండట చూశాను. ఇప్పుడు, అలా నేను మీకు కథ చెప్పుచున్నట్లుగా మీరు తలంచవచ్చును, అయితే అది సత్యమైయున్నది.ఇప్పుడు, నేను ఒక ప్రార్ధనా వరుసను పిలిచెదనని తలంచుట లేదు. నేను మీకు సత్యమే చెప్పితిననియు, సూచక క్రియలు, అద్భుతాలతో అది యధార్ధమని రుజువు చేయమని ఇక్కడ నిలబడి దేవుని అడిగెదను.77వ్యాధితో ఉన్న ప్రజలు, ఇక్కడ ఎంతమంది స్వస్థపడగోరుచున్నారు? మీరు ఎక్కడ ఉన్నప్పటికి, మీ చేతులు పైకెత్తండి. కేవలం మీ చెయ్యి ఎత్తి, ఇలా చెప్పండి, “నేను దానిని అంగీకరించుచున్నాను.” మంచిది.చూచి, బ్రతికి, మరియు నమ్మవలెనని నేను మిమ్మును కోరుచున్నాను. ఈ శ్రోతలలో ఉన్న ఎవరొ ఒకరు, ఇక్కడ నుండే, ఎవరో వ్యక్తి ఇక్కడ నుండే, కేవలం చూచుట, మరియు అనెను, “ప్రభువైన యేసు…”ఈ విధముగా మొదటగా, నేను వేదిక పిలుపు ఇచ్చిన కారణము ఆయన యొక్క అభిమానము పొందవలసి యున్నది, అని నేను నమ్ముచున్నాను. ఇది ఏదో విధముగా నాకు క్రొత్తగా ఉన్నది. మొదటగా, నేను ఆయన అభిమానము పొందవలసి ఉన్నది. నేను అభిమానము కనుగొనినయెడల, అంతలో అభిమానము పొందగా… అంతలో మీరు, ఒక డజను, లేక ఇద్దరు, అప్పుడు ఆయన దగ్గరకు ఆత్మలు వచ్చును. నిశ్చయముగా….78ఇప్పుడు, అలా క్రీస్తు దగ్గరకు వచ్చిన ప్రజలైన మీలో ప్రతీ ఒక్కరూ, అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన మంచి సంఘమును కనుగొని మరియు ఆ సంఘమునకు వెళ్ళండి. నీవు అది కనుగొనువరకు అక్కడ ఆయన బాప్తిస్మమును వెదకుడి; కేవలం వెళ్ళండి, ప్రతి రాత్రి, ప్రతి దినము ప్రార్థిస్తూనే ఉండండి. మరియు మీరు చూచుచుండగా…ఇప్పుడు, అలా వ్యాధితో ఉన్న ప్రజలైన మీరు, నేను మీకు సత్యము చెప్పిన యెడల, అలా అది సత్యమై ఉన్నదని దేవుడు సాక్ష్యము ఇచ్చును. అది నిజము. అది మాత్రమే చేయగలదు. కేవలం నీవు ప్రార్ధించి మరియు నీ పూర్ణహృదయంతో నమ్మినయెడల, దేవుడు దానిని తెలిసికొనునట్లు చేయును. కేవలము చూచి, మరియు ఇలా చెప్పుము…79ఎనిమిది సంవత్సరములు క్రితం, ఇండియానాలో, అక్కడ గ్రీన్స్-మిల్ యెద్ద ప్రభువు దూత నన్ను కలుసుకొనెను; ఒక పిల్లవానిగా ఉన్నప్పటి నుండి నన్ను వెంబడించుచూ, దర్శనములు చూపించుచుండెను. నేను ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు, ఆయన అనెను, “నీవు యధార్ధముగా ఉండి, ప్రజలు నిన్ను నమ్మునట్లుగా చేసుకొనిన యెడల, నీ ప్రార్థన ఎదుట ఏదియూ నిలబడలేదు.”ఇప్పుడు, అప్పుడు చేయగలిగి ఉండిన ఆయనే, ఇప్పుడునూ నీ కొరకు అదే ఆయన చేయగలడు. ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. అక్కడ బయట ఆయన ఎదుట సభికులు ఉన్నారు. మీలో ప్రతి ఒకనిలో ఏమి ఉన్నదో ఆయనకు తెలియును, మీరు ఏమి చేశారో, మీ కష్టము ఏమిటో, దాని గూర్చిన ప్రతి సంగతియు ఆయనకు తెలియును. మీరు అది నమ్ముచున్నారా? అప్పుడు దానిని మీ పూర్ణహృదయముతో నమ్ముము.80నేను ఇక్కడ ఒక యవ్వన మనిషి కూర్చుని ఉండి, విశ్వాసము కలిగి ఉండుటకు ప్రయత్నించుచూ, విశ్వసించుచూ యుండుట గమనించాను. నీలో ఉన్న పొరపాటు ఏదో దేవుడు నాకు తెలియజేయునని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? ఆయన అలా చేసిన యెడల, నీ స్వస్థతను నీవు అంగీకరించగలవా? నీవు గుండె సమస్య కలిగి ఉన్నావు. అది నిజము కాదా? అలా ఇప్పుడు నీవు దాని నుండి బాగుపడి ఉంటివని నేను నీకు చెప్పిన యెడల ఏమిటి? నీవు దానిని నమ్ముదువా? ఒక నిమిషము నిలబడు. నీవు ఒక నరాల బలహీనతగల గుండెతో ఉన్నావు, మరియు నీ గుండె శబ్దముతో కొట్టు కొంటుంది. అది కొంతకాలము నిన్ను బాధపెట్టెను. నీవు క్రింద పడుకొనునప్పుడు, కూడా ఆ సమయములోను అది శ్వాసను బలవంతాన అగునట్లు చేయును, ముందుకూ, వెనుకకు ఎంతో కొట్టుకొనుచుండుట నీవు కలిగియుండి, తపతప కొట్టుకొనుచుండెను. అది సరియేనా? కారణం, నతాల ద్వారా పైకివచ్చును, నీ కడుపులో అజీర్తి కలుగుటకు అది కారణమగును. అది సత్యము కాదా; నీవు ఇక దానితో బాధింపబడవు. ఇప్పుడు నీవు సరిగా ఏది కలిగి ఉన్నావో అలా భద్రముగా ఉంచుము. నీవు గృహమునకు వెళ్ళి మరియు బాగుగా ఉండుము.నేను నీ మనస్సును చదువుటలేదు. నేను నీకు పరిపూర్ణముగా క్రొత్తవాడనై యున్నాను. కేవలం అక్కడ నీవు ఒక మనిషిగా కూర్చుని ఉన్నావు. అది సరియేనా? నా జీవితములో ఎన్నడూ నిన్ను చూడలేదు, మరియు ఎన్నడూ నిన్ను గూర్చి ఎరిగి ఉండలేదు. అది సత్యమే గదా? అలా ఆ ప్రభువు ఇక్కడే ఉన్నాడని నమ్ముము!యవ్వనస్తుడా స్పష్టముగా నేను నిన్ను ఒకటి అడుగ గోరుచున్నాను, మరియు ఇది సత్యమో, కాదో నీవు చూడుము. కేవలం కొద్ది క్షణముల క్రితము ఎన్నడూ అనుకొనని విధముగా, “ముల్లు గుచ్చిన దానిలో నుండి విషము బయటకు పోయినది,” అను దానిగూర్చి నేను మాట్లాడనారంభించినప్పుడు, ఏదో వింతైన సంగతి నీ మీదకు వచ్చినది. అది యధారము కాదా? అక్కడ కూర్చుని ఉన్నప్పుడు, ఒక వింతైన భావనగా నీవు కలిగి ఉండలేదా? అది సరియైనదిగా లేదా? అంతలో అదే సమయములో నీవు నా వైపు చూడలేదా. అంతలోనే అదే సమయములో నా కన్నులు నిన్ను పట్టుకొన్నవి గదా? సరిగా అక్కడే, గుండె బాధతో ఉన్న నీవు స్వస్థత పొందావు. ఆమేన్. అది ఖచ్చితము. ఆయన ఇక్కడే ఉన్నాడు.81స్నేహితులారా, నేను మీ మనస్సును చదువుట లేదు. నేను కేవలము సత్యమే మాట్లాడాను మరియు అది సత్యమై ఉన్నదని దేవుడు రుజువు చేయును.అతనికి అక్కడే ఆ తరువాత కూర్చుని ఉన్న, నీవు దాని గూర్చి ఏమి తలంచుచున్నావు? నీవు నమ్ముచున్నావా? నన్ను దేవుని యొక్క ప్రవక్తగా నీవు నమ్ముచున్నావా? దేవుడు చేసినయెడల నీవు

నమ్ముచున్నావా… ఇక్కడ ముందు ఉన్న సీటుపై, ముందువైపున కూర్చుని ఉన్న నీవు, ఆ కారణము చేత నేను నీతో ఎక్కువగా మాట్లాడుచున్నాను, అది అక్కడ వెనుక భాగములో వెనుక మరియు నా చుట్టూ ఉన్న దానిని చూడుము. అయితే నేను నీ ఆత్మతో సంబంధము కలిగినయెడల, దేవుడు ఏది పొరపాటుగా ఉన్నదో దానిని బయలు పరచగలడని నీవు నమ్ముదువా? నీ స్వస్థతను నీవు అంగీకరించెదవా? నీకు మధుమేహ వ్యాధి ఉన్నది. అది సరియేనా? అది సత్యము అయితే నీ చెయ్యిని పైకి ఎత్తుము. నీ పాదములపై నిలబడుము. ఇప్పుడు నీ స్వస్థతను నీవు అంగీకరించుదువా? నీవు అంగీకరించుదువా? ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను సమస్తము సంపూర్ణుని చేయును గాక. దేవుడు నిన్ను దీవించును.82విశ్వాసము కలిగి ఉండుము. ఇక్కడ ఎవరో వ్యక్తి నమ్మును. నీ పూర్ణ హృదయముతో విశ్వాసము కలిగి ఉండుము.అక్కడ నీలిరంగు సూటుతో కూర్చుని ఉన్న ఒక యవ్వన పురుషుని చూస్తున్నాను. అది అతనికి సరిగా పైన నిలచి ఉన్నది. నీకు చర్మపు వ్యాధి గలదు, నీకు లేదా, యవ్వన పురుషుడా? అది నిజము కాదా? నీ పాదములపై లేచి నిలబడుము, ఓ, నీవు ఈ రాయబారితో ఉన్నట్లు నేను చూచుచున్నాను. అది సరియేనా? సరే, ఆరోగ్యముగా ఉండి నీవు గృహమునకు వెళ్ళగోరుచున్నావా? నీ చెయ్యి పైకెత్తి మరియు ఇలా చెప్పుము, “ప్రభువైన యేసూ, ఇప్పుడు నేను ప్రభువు దూత నడిపించుచున్నాడని నమ్ముచున్నాను. నేను అలా స్వస్థపరచబడ్డానని నమ్ముచున్నాను.”అక్కడ అతనికి ఆ తరువాత ఉన్న మనుష్యునికో, దాని గూర్చి నీవు ఏమి తలంచుచున్నావు, నీవు కూడా, నమ్ముచున్నావా? నేను నిన్ను చూడగలగినట్టు, ఒక నిమిషము నీ పాదములపై నిలబడుము. నీ పూర్ణ హృదయముతో; నన్ను దేవుని యొక్క సేవకునిగా నీవు నమ్ముచున్నావా? అలా ఆ గుండె బాధ నుండి జాగ్రత్తగా బయట పడగోరుచున్నావా? నీవు కలిగియున్నది అదే, అదే కదా? “నీవు కలిగి యుండినది” అని నేను అన్నాను. ఇప్పుడు నీకు అది లేదు. నీవు కూడా, గృహమునకు వెళ్ళవచ్చు.అతనికి ఆ తరువాత ఉన్న పురుషుడు, అయ్యా, నీవు దాని గూర్చి ఏమి తలంచుచున్నావు? నీ పూర్ణ హృదయముతో నీవు నమ్ముచున్నావా? నన్ను దేవుని యొక్క ప్రవక్తగా నీవు నమ్ముచున్నావా? నీ పాదములపై లేచి నిలబడుము. ఇప్పుడు నీ పూర్ణ హృదయముతో నమ్ముచున్నావా? నీకు నరముల బలహీనత ఉన్నది. అది నిజమే కదా? అది సరియేనా? నీ చెయ్యి పైకి ఎత్తుము. ఇప్పుడు నీవు బాగుపడి ఇంటికి వెళ్ళవచ్చు. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును.83ఆ వరుస క్రిందకు పంపబడిన, ఆ తరువాత వ్యక్తిని గూర్చి ఏమిటి, నీ పూర్ణ హృదయముతో నీవు నమ్ముచున్నావా? నీ పాదములపై నిలబడుము. నన్ను దేవుని యొక్క ప్రవక్తగా ఆయన సేవకునిగా నీవు నమ్ముచున్నావా? అలా నీ స్వస్థతను నీవు అంగీకరించి ఉండునట్లుగా, నీలో ఉన్న పొరపాటు ఏమిటో ఆయన నాకు చెప్పియెడల, నీవు నమ్ముదువా? అది నీ గొంతులో ఉన్నది. అది సరియేనా? యేసుక్రీస్తు నామములో గృహమునకు వెళ్ళి, బాగుగా ఉండుము.ఈ భవనములో ఏ వ్యక్తి అయినను అలా బాగుపడగోరువారు, లేచి మరియు బాగుగా ఉండగలరు. దేవుని యొక్క సేవకునిగా, నీవు నన్ను నమ్మి ఉండినయెడల, నీ పాదములపై నిలబడి ఉండుడి. దేవుడు నిన్ను దీవించును. స్త్రీల సమస్య, క్యాన్సర్, అక్కడ నుండి అది వెళ్ళును. దేవునికి స్తుతి కలుగును గాక! మీలో ప్రతి ఒక్కరు, దేవునికి మీ చేతులు ఎత్తండి.84మా పరలోకపు తండ్రి, ఈ భవనములో ఉండిన ప్రతి వ్యాధిని నేను ఇప్పుడు గద్దించుచున్నాను, ప్రతి దురాత్మను బయటకు పారద్రోలుచున్నాను, మరియు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు స్వాధీనము చేసికొని మరియు ప్రతీ వ్యక్తినీ బాగు చేయును గాక.ఒకరి పై మరొకరు మీ చేతులు ఉంచండి, మరియు ప్రతీ చోటను “ప్రభువునకు స్తోత్రము,” అని చెప్పండి. ఆనందించండి మరియు సంతోషించండి, ఎందుకనగా ప్రతి ఒక్కరినీ మిమ్మును బాగుగా చేయుటకు దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ఇక్కడే ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights